Snowfall: జమ్ముకశ్మీర్‌పై మంచు దుప్పటి.. టూరిస్టులతో సందడిగా సోనమార్గ్ లోయ
ABN , Publish Date - Jan 04 , 2026 | 04:08 PM
జమ్ముకశ్మీర్ గండర్‌బల్ జిల్లాలో ఉన్న సోనమార్గ్ లోయ మరోసారి మంచు కప్పుతో ముస్తాబైంది. తాజాగా కురుస్తున్న మంచు వర్షం వల్ల మొత్తం ప్రాంతం శ్వేత వస్త్రధారణలో మెరిసిపోతోంది.
ఆంధ్రజ్యోతి, జనవరి 4: జమ్ముకాశ్మీర్‌లోని గండర్‌బల్ జిల్లా సోనమార్గ్ లోయలో విపరీతంగా మంచు కురుస్తోంది. దీంతో ఇవాళ(ఆదివారం) ఆ ప్రాంతమంతా తెల్లటి మంచు దుప్పటి కప్పుకున్న అనుభూతి కలుగుతోంది. తాజాగా ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్‌ఐ (ANI) విడుదల చేసిన ఒక వీడియోలో పర్యాటకులు ఈ మంచు దృశ్యాలను ఆస్వాదిస్తూ, ఆనందంగా గడుపుతున్న దృశ్యాలు కళ్లకుకట్టాయి.
కాగా, సోనమార్గ్ అనేది హిమాలయాల్లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. శీతాకాలంలో మంచు ప్రేమికులను ఇది విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ మంచు వర్షం వల్ల పర్యాటకులు స్నో గేమ్స్, ఫోటోలు, సెల్ఫీలు తీసుకోవడం వంటి కార్యకలాపాల్లో మునిగిపోయారు.
లోయలోని రోడ్లు, రహదారులు, కొండలు, మంచుతో నిండిపోవడంతో ప్రకృతి అందాలు మరింత ప్రకాశవంతమయ్యాయి. ఈ ఘట్టం శీతాకాల పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుందని స్థానికులు భావిస్తున్నారు. అయితే, భారీ మంచు వల్ల రవాణా సమస్యలు ఎదురవుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. సోనమార్గ్ సందర్శనకు వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ముస్తాఫిజూర్ చేసిన తప్పేంటి? ఉదాహరణలతో వివరించిన ఆకాశ్ చోప్రా
James Anderson: సచిన్, రోహిత్ కాదు..నా ఫేవరెట్ అతడే: అండర్సన్