Akash Chopra: ముస్తాఫిజూర్ చేసిన తప్పేంటి? ఉదాహరణలతో వివరించిన ఆకాశ్ చోప్రా
ABN , Publish Date - Jan 04 , 2026 | 08:29 AM
బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ నుంచి తప్పించాలని కేకేఆర్‌కు బీసీసీఐ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026లోకి ఆ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అతడిని జట్టు నుంచి రిలీజ్ చేయాలని కేకేఆర్‌ను బీసీసీఐ ఆదేశించింది. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Akash Chopra ) స్పందించారు.
‘ముస్తాఫిజూర్(Mustafizur Rahman) వ్యక్తిగతంగా ఎలాంటి తప్పూ చేయలేదు. కానీ భారత్-బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న పరిస్థితుల ప్రభావం అతడిపై పడింది. ఇదే పరిస్థితి ఎన్నో ఏళ్లుగా పాకిస్తాన్ ఆటగాళ్లకు ఎదురవుతోంది. వాళ్లూ తప్పు చేయకపోయినా ఐపీఎల్‌లో ఆడే అవకాశం కోల్పోయారు. కొన్ని సార్లు దేశంలో జరిగే తప్పులకు ఆటగాళ్లు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇది సాఫ్ట్ పవర్ రాజకీయాల్లో భాగమే’ అని చోప్రా వ్యాఖ్యానించారు.
ఈ పరిణామాలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కూడా స్పందించారు. ‘ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముస్తాఫిజూర్ రహమాన్‌ను విడుదల చేయాలని కేకేఆర్‌కు ఆదేశించాం. అవసరమైతే ప్రత్యామ్నాయ ఆటగాడిని తీసుకునేందుకు అనుమతి ఇస్తాం’ అని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి:
కేకేఆర్ నుంచి ముస్తాఫిజుర్ ఔట్.. ఆ డబ్బులు రిఫండ్ అవుతాయా?