Team India: శ్రేయాస్ వచ్చేశాడు
ABN , Publish Date - Jan 04 , 2026 | 03:45 AM
వరల్డ్‌క్‌పనకు ముందు భారత జట్టు న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడబోతోంది. ఈనేపథ్యంలో శనివారం జాతీయ సెలెక్టర్లు 15 మందితో కూడిన ఆటగాళ్ల జాబితాను వెల్లడించారు.....
హార్దిక్‌కు విశ్రాంతి
షమీకి మొండిచేయి
కివీ్‌సతో వన్డే సిరీ్‌సకు టీమిండియా
న్యూఢిల్లీ: టీ20 వరల్డ్‌క్‌పనకు ముందు భారత జట్టు న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడబోతోంది. ఈనేపథ్యంలో శనివారం జాతీయ సెలెక్టర్లు 15 మందితో కూడిన ఆటగాళ్ల జాబితాను వెల్లడించారు. ఈనెల 11, 14, 18 తేదీలలో వడోదర, రాజ్‌కోట్, ఇండోర్‌లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో సిరీ్‌సకు దూరమైన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తిరిగి జట్టు పగ్గాలు చేపట్టగా, శ్రేయాస్ అయ్యర్‌ను కూడా జట్టులో చేర్చారు. గతేడాది ఆసీస్ పర్యటనలో తీవ్రంగా గాయపడిన అతను ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో ఆడేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్సీ నుంచి అనుమతి లభించింది. ఈనెల 6న హిమాచల్ ప్రదేశ్‌తో జరిగే మ్యాచ్ ద్వారా అతడి ఫిట్‌నె్‌సపై అంచనాకు రానున్నారు. ఇందులో ఎలాంటి ఇబ్బంది లేకపోతే తను కివీ్‌సతో సిరీ్‌సలో ఆడతాడని సెలెక్టర్లు ప్రకటించారు. ఇక సఫారీలతో వన్డే సిరీ్‌సకు దూరమైన హైదరాబాదీ పేసర్ సిరాజ్ కూడా జట్టులోకి వచ్చాడు. బుమ్రాకు విశ్రాంతినివ్వడంతో అతను పేస్ బాధ్యతలు తీసుకోనున్నాడు. అయితే దేశవాళీల్లో రాణిస్తోన్న వెటరన్ మహ్మద్ షమీకి ఇక భారత జట్టు తలుపులు మూసుకుపోయినట్టుగానే భావించాలి. ఎప్పటిలాగే అతడిని ఈసారీ పరిగణనలోకి తీసుకోలేదు. మరోవైపు టీ20 వరల్డ్‌క్‌పను దృష్టిలో ఉంచుకుని హార్దిక్‌తో 10 ఓవర్లు బౌలింగ్ వేయించేందుకు సీఓఏ అనుమతివ్వలేదు. దీంతో అతడికి విశ్రాంతినిచ్చారు. అయ్యర్ స్థానంలో వచ్చి దక్షిణాఫ్రికాపై సిరీ్‌సలో సెంచరీ బాదిన రుతురాజ్‌తో పాటు కీపర్ జురెల్, తిలక్ వర్మలను పక్కనబెట్టారు. రెండో వికెట్ కీపర్‌గా పంత్ కొనసాగనున్నాడు. సిరాజ్, హర్షిత్, అర్ష్‌దీప్, ప్రసిద్ధ్ పేస్ విభాగంలో ఉండగా, పెద్దగా రాణించలేకపోతున్న ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ స్థానం నిలుపుకోవడం గమనార్హం. ఇదిలావుండగా వెటరన్ స్టార్ ఆటగాళ్లు విరాట్, రోహిత్ ప్రత్యేక ఆకర్షణగా ఉండడంతో వీరి ఆట కోసం ఎప్పటిలాగే స్టేడియాలు కళకళలాడతాయనడంలో సందేహం లేదు.