Vijay HaZare Trophy: హార్దిక్ పాండ్య సూపర్ సెంచరీ
ABN , Publish Date - Jan 03 , 2026 | 02:38 PM
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా రాజ్‌కోట్ వేదికగా బరోడా, విదర్భ జట్లు తలపడుతున్నాయి. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య బరోడా తరఫున బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో పాండ్య సెంచరీతో చెలరేగాడు.
ఇంటర్నెట్ డెస్క్: విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా రాజ్‌కోట్ వేదికగా బరోడా, విదర్భ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన విదర్భ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బరోడా జట్టు బ్యాటింగ్‌కి దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 293 పరుగులు చేసింది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య బరోడా తరఫున బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో పాండ్య(133, 92 బంతుల్లో 8 ఫోర్లు, 11 సిక్సులు) సెంచరీతో చెలరేగాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో హార్దిక్ పాండ్య(Hardik Pandya)కు ఇది తొలి సెంచరీ కావడం గమనార్హం.
38వ ఓవర్ వరకు 62 బంతుల్లో 66 పరుగులు మాత్రమే చేసిన హార్దిక్.. 39వ ఓవర్లో వరుసగా 5 సిక్సులు, ఒక ఫోర్ బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మిగతా బ్యాటర్లంతా పరుగులు చేయడంలో విఫలమయ్యారు. ఏ ఒక్క బ్యాటర్ కూడా 30 పరుగుల మార్క్‌ను దాటలేకపోయారు. సొలంకీ 26, కృనాల్ పాండ్య 23, షెత్ 21 మాత్రమే ఓ మోస్తరు పరుగులు చేశారు.
విదర్భ బౌలర్లలో యశ్ ఠాకూర్ 4, పార్థ్, నచికేత్‌లు తలో 2, ప్రఫుల్ 1 వికెట్ తీసుకున్నారు. అనంతరం ఛేదన ప్రారంభించిన విదర్భ 7 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 49 పరుగులు చేసింది. క్రీజులో అథర్వ టైడే (15*), అమన్ (31*) కొనసాగుతున్నారు. ప్రస్తుతానికి విదర్భకు విజయం సాధించాలంటే 245 పరుగులు అవసరం.
ఇవి కూడా చదవండి:
షాకింగ్.. ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ స్టార్ ప్లేయర్ ఔట్
భారత ఫుట్‌బాల్‌ను కాపాడండి!.. ఫిఫాకు ఆటగాళ్ల విజ్ఞప్తి