Home » Hardik Pandya
శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు గాయాల బెడద తప్పడం లేదు. అయితే ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో గాయపడిన స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, మరో ప్లేయర్ హార్దిక్ పాండ్య గాయాలపై తాజాగా సమాచారం బయటకు వచ్చింది.
హార్దిక్ పాండ్యను చెన్నై సూపర్ కింగ్స్ లేదా కోల్‌కతా నైట్ రైడర్స్‌కు పంపేందుకు ఎంఐ ప్రయత్నిస్తోందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యను చెన్నై సూపర్ కింగ్స్‌కు ట్రేడ్ చేయనున్నారనే ప్రచారం ఊపందుకున్న వేళ.. ఆ వార్తలకు ఎంఐ ఫ్రాంచైజీ చెక్ పెట్టింది. హార్దిక్ విషయంలో సీఎస్కేతో గానీ, మరే ఇతర ఫ్రాంచైజీలతో గానీ ఎలాంటి చర్చలు జరపడం లేదని ఎంఐ ప్రతినిధి స్పష్టం చేశారు.
టీమ్ఇండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ అమలు చేస్తున్న సెలక్షన్ విధానంపై టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విమర్శలు గుప్పించాడు. గత వరల్డ్ కప్ సమయంలో హార్దిక్ గాయపడినపుడు.. నాటి కోచ్ రాహుల్ ద్రవిడ్ చక్కటి వ్యూహాన్ని అమలు చేశారని గుర్తుచేశాడు.
ట్రేడ్ డీల్‌లో భాగంగా హార్దిక్ పాండ్యను దక్కించుకునేందుకు ఏకంగా ఏడు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు మినహా అన్ని ఫ్రాంచైజీలు హార్దిక్‌ను జట్టులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యను గాయాల ముప్పు వేధిస్తూనే ఉంది. తాజాగా తొడకండరాల గాయం కారణంగా అతను ఇంగ్లండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు.
భారత క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. అఫ్గానిస్థాన్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చాడు.
మరో మూడు రోజుల్లో అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టీమిండియాకు మరో షాక్ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్య జట్టుకు దూరం అయ్యాడు.
జూన్ 13 నుంచి అఫ్గాన్‌తో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో భారత జట్టుకు ఊరటనిచ్చే వార్త అందింది. గాయం బారిన పడిన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య పూర్తి ఫిట్ సాధించాడు.
భారత జట్టులోని సీనియర్ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ, హార్దిక్‌ను బీసీసీఐ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు హాజరు కావాలని ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు హార్దిక్ మాత్రమే స్పందించినట్లు సమాచారం.