Hardik Pandya: గొప్ప మనసు చాటుకున్న హార్దిక్ పాండ్య.. ఏం చేశాడంటే?
ABN , Publish Date - Dec 20 , 2025 | 09:58 AM
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య గొప్ప మనసు చాటుకున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన ఐదో టీ20లో హార్దిక్ పాండ్య చెలరేగి ఆడాడు. పాండ్య కొట్టిన ఓ సిక్సర్ ఫీల్డ్ వెలుపల ఉన్న కెమెరామెన్‌కు బలంగా తాకింది. మ్యాచ్ అనంతరం అతడి దగ్గరకు వెళ్లి పాండ్య హగ్ ఇచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య గొప్ప మనసు చాటుకున్నాడు. సౌతాఫ్రికాతో అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐదో టీ20లో హార్దిక్ వీర బాదుడు బాదిన విషయం తెలిసిందే. పాండ్య కొట్టిన ఓ భారీ సిక్సర్ ఫీల్డ్ వెలుపల ఉన్న కెమెరామెన్‌కి తాకింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. కెమెరామెన్ దగ్గరకి వెళ్లి పాండ్య(Hardik Pandya) క్షమాపణలు చెప్పడంతో పాటు హగ్ కూడా ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసలు ఏం జరిగిందంటే..?
టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన భారత్.. సూపర్ నాక్ ఆడింది. తిలక్ వర్మ(73), హార్ది్క్ పాండ్య(63) చెలరేగి ఆడటంతో టీమిండియా 231 పరుగులు చేసింది. హార్దిక్ ఏకంగా 25 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సులతో వీరంగం సృష్టించాడు. అయితే కార్బిన్ బోష్ వేసిన 13వ ఓవర్ రెండో బంతిని హార్దిక్ పాండ్య మిడాఫ్ దిశగా సిక్స్ కొట్టాడు. ఆ బంతి నేరుగా వెళ్లి బౌండరీ బయట ఉన్న కెమెరామెన్ ఎడమ చేతి భుజానికి బలంగా తాకింది. ఆ సమయంలో కెమెరామెన్ డగౌట్ దృశ్యాలను షూట్ చేస్తూ.. హార్ది్క్ సిక్సర్‌ను గమనించుకోలేదు. భారత ఫిజియో వచ్చి అతనికి పెయిన్ రిలీఫ్ స్ప్రే చేశాడు. అయినా నొప్పి తగ్గకపోవడంతో ఐస్ బ్యాగ్ పెట్టుకొని కనిపించాడు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కెమెరామెన్ గాయంపై ఆరా తీసాడు. భారత ఫీల్డింగ్ చేయడానికి ముందు హార్దిక్ పాండ్యా.. నేరుగా కెమెరామెన్ దగ్గరకు వెళ్లి ఎలా ఉందని పలకరించాడు. అనంతరం అతన్ని హగ్ చేసుకోవడంతో పాటు క్షమాపణలు చెప్పాడు. గాయమైన చోటు ఐస్ ప్యాక్ పెట్టాడు.
ఇవీ చదవండి:
Team India: నేడే టీ20 ప్రపంచ కప్‌కు భారత జట్టు ఎంపిక.. ఏం జరగబోతోందో?
Ind Vs SA: సిరీస్ గెలిచినా.. ఓ పెద్ద లోటు ఉండిపోయింది: కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్