దక్షిణాఫ్రికాతో జరిగిన 5వ టీ20 మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఊచకోత కోశారు. కేవలం 25 బంతుల్లోనే 63 పరుగులు చేసి విధ్వంసం సృష్టించారు. ఈ క్రమంలో హార్దిక్ కొట్టిన ఓ బాల్.. బౌండరీ లైన్ దాటి వెళ్లి ఓ కెమెరామెను తలగిలింది. దీంతో అతడి చేతికి గాయమైంది. అయితే హార్దిక్ ఆ కెమెరామెన్ వద్దకు వెళ్లి అతడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కెమెరామెన్‌ను హగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది.