The Ashes: ముగిసిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్.. ఇంగ్లండ్ టార్గెట్ 435
ABN , Publish Date - Dec 20 , 2025 | 08:01 AM
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మూడో టెస్టులో తలపడుతున్నాయి. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 349 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని ఆస్ట్రేలియా 434 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంగ్లండ్ విజయ లక్ష్యం 435 పరుగులు.
ఇంటర్నెట్ డెస్క్: అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య మూడో టెస్ట్ జరుగుతుంది. 271/4 ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ 84.4 ఓవర్లలో 349 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని ఆస్ట్రేలియా 434 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఓపెనర్ ట్రావిస్ హెడ్(170) విధ్వంసం సృష్టించాడు. వికెట్ కీపర్ అలెక్స్ కెరీ(72) హాఫ్ సెంచరీ చేశాడు. ఉస్మాన్ ఖవాజా(40) పర్వాలేదనిపించాడు. జోష్ ఇంగ్లిస్(10), పాట్ కమిన్స్(6), వెదర్లాండ్(1), లుబుషేన్(13), గ్రీన్(7), లైయాన్(0), బోల్యాండ్(1) తీవ్రంగా నిరాశపర్చారు. మిచెల్ స్టార్క్(7) నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో టంగ్ 4, బ్రైడన్ కార్స్ 3, జోఫ్రా ఆర్చర్, విల్ జాక్స్, బెన్ స్టోక్స్ తలో వికెట్ తీసుకున్నారు.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 371 పరుగులు, ఇంగ్లండ్ 286 పరుగులు చేసిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 4 ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయి 20 పరుగులు చేసింది. కమిన్స్ బౌలింగ్‌లో డకెట్(4) లుబుషేన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. క్రీజులో క్రాలీ(1), ఓలీ పోప్(7) ఉన్నారు.
ఇవీ చదవండి:
Team India: నేడే టీ20 ప్రపంచ కప్‌కు భారత జట్టు ఎంపిక.. ఏం జరగబోతోందో?
Ind Vs SA: సిరీస్ గెలిచినా.. ఓ పెద్ద లోటు ఉండిపోయింది: కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్