Share News

పాక్ మ్యాచ్‌లో ప్రత్యేక వాచ్‌ ధరించిన హార్దిక్‌.. ధర ఎంతో తెలుసా..?

ABN , Publish Date - Feb 17 , 2026 | 07:55 AM

పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హర్దిక్ పాండ్య ధరించిన ఓ వాచ్ అందరిని ఆకట్టుకుంది. అందులో శివుడి ప్రతిమ ఉండటం విశేషం. ఈ వాచ్ ఖరీదు ఎంతా అని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.

పాక్ మ్యాచ్‌లో ప్రత్యేక వాచ్‌ ధరించిన హార్దిక్‌.. ధర ఎంతో తెలుసా..?

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా ఫిబ్రవరి 15న భారత్, పాకిస్థాన్(Ind vs Pak) జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు ఎంత హంగామా జరిగింది. అయితే మ్యాచ్ ప్రారంభమయ్యాక వార్ వన్ సైడ్ అయ్యింది. అన్ని విభాగాల్లో పాకిస్థా‌న్‌పై భారత్ ఆధిపత్యం చెలాయించింది. బ్యాటింగ్ లో ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించాడు. ఇది ఇలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హర్దిక్ పాండ్య ధరించిన ఓ వాచ్ అందరిని ఆకట్టుకుంది. అందులో శివుడి ప్రతిమ ఉండటం విశేషం. ఈ వాచ్ ఖరీదు ఎంతా అని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...


పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ హర్దిక్(Hardik Pandya) ధరించిన వాచ్ 'జాకబ్ & కో ఎపిక్ X క్రోనో 44ఎంఎం టైటానియం ' మోడల్ కి చెందినది. ఈ వాచ్ ఖరీదు భారత మార్కెట్లో రూ.29 లక్షల నుంచి రూ. 34 లక్షల వరకు ఉంటుందని అంచనా. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. వాచ్ డయల్‌పై శివుడి బొమ్మను(Shiva watch) ముద్రించినట్లు తెలుస్తుంది.


పాకిస్థాన్‌తో మ్యాచ్ జరిగిన రోజు శివరాత్రి కావడంతో హార్దిక్‌ తన భక్తిని ఈరకంగా చాటుకున్నాడని నెటిజన్లు అనుకుంటున్నారు. పాండ్యకు లగ్జరీ వాచ్‌ల పట్ల ఉన్న పిచ్చి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ బరోడా ఆటగాడు ప్రపంచంలో దొరికే దాదాపు అన్ని ఖరీదైన వాచ్‌లు తన కలెక్షన్‌లో కలిగి ఉన్నాడు. తాజాగా హార్దిక్‌ ధరించిన ఈ టైటానియం వాచ్‌ కూడా ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.


గతంలో హార్దిక్‌ ధరించిన అతి ఖరీదైన వాచ్‌లు ఇవే.

  • రిచర్డ్ మిల్లె RM 27-04 – ధర రూ. 20 కోట్లు

  • రిచర్డ్ మిల్లె RM 27-02 – ధర రూ.7 కోట్లు

  • రిచర్డ్ మిల్లె RM 56-03 బ్లూ సఫైర్– ధర రూ.53–54 కోట్లు

  • రోలెక్స్ డేటోనా రెయిన్‌బో – ధర రూ.4–5 కోట్లు

  • ఆడెమర్స్ పిగ్యుట్ రాయల్ ఓక్ – ధర రూ.3.25 కోట్లు

  • రోలెక్స్ ఐ ఆఫ్ ది టైగర్ – ధర రూ.2–2.5 కోట్లు


ఇవి కూడా చదవండి:

ఆ సమయంలో మా డ్రెస్సింగ్ రూం నిరాశతో నిండిపోయింది: పాక్ హెడ్ కోచ్

టీ20 ప్రపంచ కప్ 2026: చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్

Updated Date - Feb 17 , 2026 | 08:02 AM