రేసులోనే అఫ్ఘాన్
ABN , Publish Date - Feb 17 , 2026 | 05:08 AM
టీ20 వరల్డ్‌క్‌పలో అఫ్ఘాన్ ఎట్టకేలకు బోణీ చేసింది. అజ్మతుల్లా ఒమర్జాయ్ (4/15; 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 నాటౌట్) ఆల్‌రౌండ్‌షోతో ఆకట్టుకున్నాడు. దీంతో సోమవారం యూఏఈతో జరిగిన...
సూపర్-8లో సఫారీలు
ఒమర్జాయ్ ఆల్‌రౌండ్‌షో
యూఏఈపై విజయం
న్యూఢిల్లీ: టీ20 వరల్డ్‌క్‌పలో అఫ్ఘాన్ ఎట్టకేలకు బోణీ చేసింది. అజ్మతుల్లా ఒమర్జాయ్ (4/15; 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 నాటౌట్) ఆల్‌రౌండ్‌షోతో ఆకట్టుకున్నాడు. దీంతో సోమవారం యూఏఈతో జరిగిన ఆసక్తికరపోరులో అఫ్ఘాన్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. అలాగే తమ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అటు ఈ ఫలితంతో గ్రూప్ ‘డి’ నుంచి దక్షిణాఫ్రికా సూపర్-8లో అడుగుపెట్టింది. ఇందులో కివీ్‌సకు తప్ప మిగతా మూడు జట్లకు ఆరు పాయింట్లు వచ్చే అవకాశం లేదు. ఆఖరి మ్యాచ్‌లో కెనడా చేతిలో కివీస్ ఓడి.. అదే కెనడాను తాము చిత్తుగా ఓడిస్తే రన్‌రేట్ పరంగా అఫ్ఘాన్‌లు ముందుకెళ్లే చాన్సుంది. ఇక ముందుగా బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ 20 ఓవర్లలో 160/9 స్కోరు సాధించింది. సొహైబ్ ఖాన్ (48 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 68), షరాఫు (40) మాత్రమే రాణించారు. ముజీబ్‌కు రెండు వికెట్లు దక్కాయి. అలాగే టీ20 ఫార్మాట్‌లో 700 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రషీద్ నిలిచాడు. ఆ తర్వాత ఛేదనలో అఫ్ఘాన్ 19.2 ఓవర్లలో 162/5 స్కోరుతో గెలిచింది. జద్రాన్ (53), డార్విష్ (33) కీలక ఇన్నింగ్స్ ఆడారు. జునైద్, అర్ఫాన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఒమర్జాయ్ నిలిచాడు.
ఇవి కూడా చదవండి:
ఆ సమయంలో మా డ్రెస్సింగ్ రూం నిరాశతో నిండిపోయింది: పాక్ హెడ్ కోచ్
టీ20 ప్రపంచ కప్ 2026: చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్