సూపర్-8కు ఇంగ్లండ్
ABN , Publish Date - Feb 17 , 2026 | 05:06 AM
ఆడుతోంది తొలి ప్రపంచ కప్ అయినా..మాజీ చాంపియన్ ఇంగ్లండ్‌ను ఇటలీ బెదరగొట్టింది. 203 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఇంగ్లండ్‌కు షాకిచ్చేలా కనిపించింది. కానీ కీలక సమయంలో...
పోరాడి ఓడిన ఇటలీ
కోల్‌కతా: ఆడుతోంది తొలి ప్రపంచ కప్ అయినా..మాజీ చాంపియన్ ఇంగ్లండ్‌ను ఇటలీ బెదరగొట్టింది. 203 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఇంగ్లండ్‌కు షాకిచ్చేలా కనిపించింది. కానీ కీలక సమయంలో వికెట్ తీసిన కర్రాన్ ఇంగ్లండ్‌కు ఊరట నిచ్చాడు. దీంతో ఇంగ్లండ్ సూపర్-8కు దూసుకెళ్లింది. సోమవారం జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో మొదట ఇంగ్లండ్ 20 ఓవర్లలో 202/7 స్కోరు చేసింది. విల్ జాక్స్ (22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53) ధనాధన్ హాఫ్ సెంచరీ సాధించాడు. బాంటన్ (30), సాల్ట్ (28) సత్తా చాటారు. కలుగమగే, స్టివార్ట్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఛేదనలో ఇటలీ 20 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. బెన్ మనెంటి (25 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 60), స్టివార్ట్ (23 బంతుల్లో 45) ఇంగ్లండ్ బౌలర్లలో గుబులు పుట్టించారు. మనెంటి ఆడుతున్నంత సేపూ ఇటలీ రేస్‌లోనే నిలిచింది. అతడిని జాక్స్ అవుట్ చేశాక, స్టివార్ట్ భారీ షాట్లతో ఇంగ్లండ్‌ను బెంబేలెత్తించాడు. కానీ స్టివార్ట్ వికెట్ తీసిన కర్రాన్ ఇంగ్లండ్‌ను గెలుపు దిశగా మళ్లించాడు.
ఇంగ్లండ్: 20 ఓవర్లలో 202/7 (విల్ జాక్స్ 53 నాటౌట్, బాంటమ్ 30, సాల్ట్ 28, కర్రాన్ 25, బెతెల్ 23, కలుగమగే 2/41, గ్రాంట్ స్టివార్ట్ 2/51)
ఇటలీ: 20 ఓవర్లలో 178 ఆలౌట్ (బెన్ మనెంటి 60, గ్రాంట్ స్టివార్ట్ 45, మోస్కా 43, ఓవర్టన్ 3/18, కర్రాన్ 3/22, ఆర్చర్ 2/35).
ఇవి కూడా చదవండి:
ఆ సమయంలో మా డ్రెస్సింగ్ రూం నిరాశతో నిండిపోయింది: పాక్ హెడ్ కోచ్
టీ20 ప్రపంచ కప్ 2026: చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్