Share News

శతక్కొట్టిన నిస్సాంక

ABN , Publish Date - Feb 17 , 2026 | 05:12 AM

టీ20 వరల్డ్‌క్‌పలో ఆతిథ్య శ్రీలంక హ్యాట్రిక్‌ విజయాలతో సూపర్‌-8లోకి ప్రవేశించింది. సోమవారం గ్రూప్‌ ‘బి’లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ షోతో ఆకట్టుకున్న శ్రీలంక 8 వికెట్ల తేడాతో...

శతక్కొట్టిన నిస్సాంక

నేటి మ్యాచ్‌లు

న్యూజిలాండ్‌X కెనడా

(ఉ. 11 గం. నుంచి)

ఐర్లాండ్‌ Xజింబాబ్వే (మ.3 గం.)

నేపాల్‌ Xస్కాట్లాండ్‌ (రా.7 గం.)

సూపర్‌-8లో శ్రీలంక

కొలంబో: టీ20 వరల్డ్‌క్‌పలో ఆతిథ్య శ్రీలంక హ్యాట్రిక్‌ విజయాలతో సూపర్‌-8లోకి ప్రవేశించింది. సోమవారం గ్రూప్‌ ‘బి’లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ షోతో ఆకట్టుకున్న శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్‌ పతుమ్‌ నిస్సాంక (52 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 100 నాటౌట్‌) ద్వారా తాజా టోర్నీలో తొలి శతకం నమోదైంది. ఈ గెలుపుతో లంక ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఆసీస్‌ మూడు మ్యాచ్‌ల్లో రెండు పాయింట్లతో తమ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఎందుకంటే జింబాబ్వే మరో మ్యాచ్‌ గెలిస్తే చాలు ఆసీస్‌ ఇంటిముఖం పడుతుంది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 20 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు హెడ్‌ (29 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 56)తో పాటు టోర్నీలో తొలి మ్యాచ్‌ ఆడిన కెప్టెన్‌ మార్ష్‌ (27 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 54) తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగారు. వీరి జోరుకు ఓ దశలో 8.2 ఓవర్‌లోనే స్కోరు 104కు చేరింది. ఈ స్థితిలో జట్టు స్కోరు 220 ఖాయమనిపించింది. కానీ ఆ తర్వాత లంక బౌలర్లు కట్టడి చేయగా ఆసీస్‌ తడబడింది. ఇన్‌గ్లి్‌స (27), మ్యాక్స్‌వెల్‌ (22) మాత్రమే ఫర్వాలేదనిపించారు. హేమంతకు మూడు, చమీరకు రెండు వికెట్లు దక్కాయి.

నిస్సాంక జోరు: భారీ ఛేదనలో శ్రీలంక 18 ఓవర్లలో 184/2 స్కోరుతో గెలిచింది. టీ20 వరల్డ్‌క్‌పల్లో ఈ జట్టుకిదే అత్యధిక ఛేదన. నిస్సాంక, కుశాల్‌ మెండిస్‌ (51) ఆసీస్‌ బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొంటూ రెండో వికెట్‌కు 97 పరుగులు జత చేశారు. ఆ తర్వాత రత్నాయకే (28 నాటౌట్‌) అండతో మూడో వికెట్‌కు నిస్సాంక 34 బంతుల్లోనే 79 పరుగుల అజేయ భాగస్వామ్యం నమోదు చేసి మ్యాచ్‌ను ముగించాడు. స్టొయిని్‌సకు రెండు వికెట్లు దక్కగా.. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిస్సాంక నిలిచాడు.


సంక్షిప్త స్కోర్లు

ఆస్ట్రేలియా: 20 ఓవర్లలో 181 ఆలౌట్‌. (హెడ్‌ 56, మార్ష్‌ 54, ఇన్‌గ్లి్‌స 27; హేమంత 3/37, చమీర 2/36).

శ్రీలంక: 18 ఓవర్లలో 184/2 (నిస్సాంక 100 నాటౌట్‌, మెండిస్‌ 51; స్టొయినిస్‌ 2/46).

పాయింట్ల పట్టిక

గ్రూప్‌-బి

జటు ఆ గె ఓ పా ర.రే

శ్రీలంక 3 3 0 6 2.462

జింబాబ్వే 2 2 0 4 1.984

ఆస్ర్టేలియా 3 1 2 2 0.414

ఐర్లాండ్‌ 3 1 2 2 0.150

ఒమన్‌ 3 0 3 0 -4.546

గ్రూప్‌-సి

వెస్టిండీస్‌ 3 3 0 6 1.820

ఇంగ్లండ్‌ 4 3 1 6 0.201

స్కాట్లాండ్‌ 3 1 2 2 0.359

ఇటలీ 3 1 2 2 -0.588

నేపాల్‌ 3 0 3 0 -1.942

గ్రూప్‌-డి

దక్షిణాఫ్రికా 3 3 0 6 1.477

న్యూజిలాండ్‌ 3 2 1 4 0.701

అఫ్ఘానిస్థాన్‌ 3 1 2 2 -0.215

యూఏఈ 3 1 2 2 -0.797

కెనడా 2 0 2 0 -1.526

ఆ: ఆడినవి; గె: గెలిచినవి; ఓ: ఓడనవి;

పా:పాయింట్లు; ర.రే: రన్‌రేట్‌

ఇవి కూడా చదవండి:

ఆ సమయంలో మా డ్రెస్సింగ్ రూం నిరాశతో నిండిపోయింది: పాక్ హెడ్ కోచ్

టీ20 ప్రపంచ కప్ 2026: చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్

Updated Date - Feb 17 , 2026 | 05:12 AM