కుల్దీప్ యాదవ్‌పై హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ ఆగ్రహం!.. వీడియో వైరల్
ABN , Publish Date - Feb 16 , 2026 | 10:40 AM
భారత్‌పై పాక్ 61 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ అనంతరం టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 61 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ అనంతరం టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
176 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్.. 114 పరుగులకే కుప్పకూలింది. పాక్ ఇన్నింగ్స్‌కు ముగింపు పలికిన చివరి వికెట్‌ను హార్దిక్ పడగొట్టాడు. ఆటగాళ్లు ఒకరినొకరు అభినందించుకుంటున్న సమయంలో హార్దిక్ ముఖంలో అసహనం స్పష్టంగా కనిపించింది. కుల్దీప్‌తో అతడు తీవ్రంగా మాట్లాడగా, సూర్యకుమార్ కూడా ఏదో సూచించినట్లు కనిపించింది. తిలక్ వర్మ ఆందోళనగా చూస్తుండగా, రింకూ సింగ్ మధ్యలోకి వచ్చి పరిస్థితిని సద్దుమణిగించే ప్రయత్నం చేశాడు.
అయితే దీనికి కారణం కుల్దీప్ వదిలేసిన క్యాచ్ అని తెలుస్తోంది. హార్దిక్ వేసిన ఆఖరి ఓవర్‌లో షాహీన్ అఫ్రిది లాంగ్ ఆన్ వైపు కొట్టిన బంతిని కుల్దీప్ బౌండరీ రోప్ సమీపంలో అందుకునే ప్రయత్నం చేశాడు. రెండు చేతులు తగిలినా బంతి జారిపడి సిక్సర్‌గా మారింది. ఆ తప్పిదం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపకపోయినా కీలక మ్యాచ్‌ల్లో ఇలాంటి పొరపాట్లు చేయడంపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
పాక్‌పై భారత్ గెలుపు.. టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
ఇషాన్ కిషన్ పూర్తి బాధ్యత తీసుకున్నాడు.. అందుకే గెలిచాం: కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్