Share News

భారత్‌ను పాక్ ఓడిస్తుందని కలలో కూడా ఊహించలేం.. అతడు అనర్హుడు: షోయబ్ అక్తర్

ABN , Publish Date - Feb 16 , 2026 | 09:47 AM

మరోసారి భారత్ చేతిలో ఓడిపోవడంతో పాకిస్థాన్ జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం కొలంబో వేదికగా జరిగిన టీ-20 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోయింది. కనీస పోటీ కూడా ఇవ్వకుండా చేతులెత్తేసింది. దీంతో మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆ జట్టుపై దుమ్మెత్తి పోస్తున్నారు.

భారత్‌ను పాక్ ఓడిస్తుందని కలలో కూడా ఊహించలేం.. అతడు అనర్హుడు: షోయబ్ అక్తర్
Akhtar on Pakistan loss

మరోసారి భారత్ చేతిలో ఓడిపోవడంతో పాకిస్థాన్ జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం కొలంబో వేదికగా జరిగిన టీ-20 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోయింది. కనీస పోటీ కూడా ఇవ్వకుండా చేతులెత్తేసింది. దీంతో మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆ జట్టుపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఆ జట్టు మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీపై విమర్శలు చేశాడు (Akhtar on Pakistan loss).


'మేము మ్యాచ్‌లో ఏ దశలోనూ పోటీలో లేము. షాహీన్ 125 కి.మీ./గం. వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు. ఇంత వేగం ఆధునిక క్రికెట్‌కు అవసరం లేదు. వీరు ఒత్తిడిని తట్టుకునే ప్రతిభావంతులు కాదు. మ్యాచ్ జరిగిన తీరు చూస్తే ఏ దశలోనూ భారత్‌ను పాక్ ఓడిస్తుందని కలలో కూడా ఊహించలేము. గత 15-20 సంవత్సరాలుగా క్రికెట్‌పై మేం నిజాయితీగా పెట్టుబడి పెట్టలేదు. ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించలేదు' అని అక్తర్ పేర్కొన్నాడు (PCB chairman controversy).


'క్రికెట్ గురించి ఏమీ తెలియని వ్యక్తి (మొహ్సిన్ నఖ్వీ) పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ అయ్యాడు (India Pakistan T20 match). అతడు ఏమి చేయగలడు. జట్టు కూర్పు ఎలా ఉండాలో అతడికేం తెలుసు. ఒక్క ఆట కూడా గెలిపించలేని ఆటగాడిని (బాబర్ ఆజం) నఖ్వీ సూపర్ స్టార్‌గా మార్చాడు. ప్రపంచంలోనే అతిపెద్ద నేరం ఏంటంటే.. అసమర్థులకు ఎక్కువ అవకాశాలు కల్పించడం. పీసీబీ చైర్మన్‌గా ఉండడానికి నఖ్వీ అనర్హుడు' అని అక్తర్ విమర్శించాడు.


ఇవి కూడా చదవండి..

దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..


పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన టీమిండియాకు ఏపీ సీఎం అభినందనలు..

Updated Date - Feb 16 , 2026 | 09:47 AM