Share News

Ind Vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. భారత జట్టు ఇదే!

ABN , Publish Date - Jan 03 , 2026 | 04:55 PM

టీ20 ప్రపంచ కప్ 2026కి ముందు టీమిండియా న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. శనివారం బీసీసీఐ న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు సంబంధించి టీమిండియా జట్టును ప్రకటించింది.

Ind Vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. భారత జట్టు ఇదే!
Shubman Gill

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026కి ముందు టీమిండియా న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. జనవరి 11 నుంచి స్వదేశంలోనే ఈ సిరీస్ ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచ కప్‌నకు సంబంధించి ఇప్పటికే బీసీసీఐ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వన్డే సిరీస్‌కు మాత్రం కాస్త సమయం వేచి ఉండాల్సి వచ్చింది. ఎట్టకేలకు శనివారం బీసీసీఐ న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు సంబంధించి టీమిండియా జట్టును ప్రకటించింది.


అయ్యర్ లైన్ క్లియర్..

భారత వన్డే వైస్‌ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. బీసీసీఐ సెంటర్ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (CoE)లో ఇంటెన్సివ్ రిహాబ్ బ్లాక్‌ను శ్రేయస్ పూర్తిచేసుకున్నాడు. గతేడాది అక్టోబర్ ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో క్యాచ్ అందుకునే క్రమంలో శ్రేయస్‌కు తీవ్రమైన గాయమైంది. దీంతో తర్వాత జరిగిన మ్యాచ్‌లకు అయ్యర్ దూరమయ్యాడు. డిసెంబర్ 25న (CoE)లో చేరిన శ్రేయస్.. స్ట్రెంత్‌ అండ్ కండీషనింగ్‌లో పురోగతి సాధించాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో నాలుగు సెషన్లపాటు కఠినమైన సాధన పూర్తి చేశాడు. మ్యాచ్ సిమ్యులేషన్‌ సెషన్స్‌లోనూ పాల్గొన్నాడు. దీంతో జట్టులో చోటు దక్కించుకున్నాడు.


షమీకి మాత్రం మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల దేశవాళీల్లో ఆకట్టుకున్న షమీకి చోటు దక్కుతుందని అంతా భావించారు. కానీ సెలక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు.


భారత తుది జట్టు ఇదే..

శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, జడేజా, సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్.


ఇవి కూడా చదవండి:

హార్దిక్ పాండ్య సూపర్ సెంచరీ

కేకేఆర్ నుంచి ముస్తాఫిజుర్ ఔట్.. ఆ డబ్బులు రిఫండ్ అవుతాయా?

Updated Date - Jan 03 , 2026 | 05:22 PM