Share News

James Anderson: సచిన్, రోహిత్ కాదు..నా ఫేవరెట్ అతడే: అండర్సన్

ABN , Publish Date - Jan 04 , 2026 | 02:51 PM

ఇంగ్లాండ్ లెజెండరీ బౌలర్ జేమ్స్ అండర్సన్ దాదాపు రెండు దశాబ్దాల కెరీర్‌లో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ వంటి దిగ్గజాలకు బౌలింగ్ చేశారు. అయితే విరాట్ కోహ్లీతో సాగించిన పోరాటం అత్యంత చిరస్మరణీయమని ఆయన పేర్కొన్నారు. తాజాగా ఓ ప్రముఖ స్పోర్ట్స్‌ ఛానల్ తో మాట్లాడిన సందర్భంగా.. భారత్ నుంచి కోహ్లీ తన ఫేవరెట్ ప్లయర్ అని అండర్సన్ వెల్లడించారు.

James Anderson: సచిన్, రోహిత్ కాదు..నా ఫేవరెట్ అతడే: అండర్సన్
James Anderson

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్ లెజెండ్ జేమ్స్ అండర్సన్(James Anderson) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెట్ ప్రపంచంలో సుదీర్ఘ కాలం పాటు బౌలర్ గా కొనసాగి 704 టెస్టు వికెట్లు పడగొట్టాడు. తరచూ ఆయన ఏదో ఒక అంశంతో సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. తాజాగా ఓ ప్రముఖ స్పోర్ట్స్‌ ఛానల్ తో మాట్లాడిన సందర్భంగా.. ఆండర్సన్ వివిధ దేశాల నుంచి తన ఫేవరెట్ ప్లేయర్లు(Favorite Cricketer) ఎవరు అనేది వెల్లడించారు. ఈ క్రమంలో భారత్ నుంచి సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ వంటి ఉద్దండులను పక్కనపెట్టి తన ఫేవరెట్ క్రికెటర్‌ను ఎంచుకున్నారు. అనేక తరాల భారతీయ బ్యాటర్లను ఎదుర్కొన్న జేమ్స్ అండర్సన్.. అందరికంటే ఎక్కువగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తనను ఆకట్టుకున్నాడని వెల్లడించాడు.


కోహ్లీనే ఎందుకంటే..

జేమ్స్ అండర్సన్ (James Anderson)దాదాపు రెండు దశాబ్దాల కెరీర్‌లో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ వంటి దిగ్గజాలకు బౌలింగ్ చేశారు. అయితే విరాట్ కోహ్లీతో సాగించిన పోరాటం అత్యంత చిరస్మరణీయమని ఆయన పేర్కొన్నారు. కోహ్లీ చూపించే దూకుడు, ఆటపై అతనికున్న నిబద్ధత అండర్సన్‌ను బాగా ఆకట్టుకున్నాయట. 2014 ఇంగ్లాండ్ పర్యటనలో కోహ్లీని అండర్సన్(Kohli vs Anderson) నాలుగు సార్లు ఔట్ చేశాడు. కానీ పడిలేచిన కెరటంలా కోహ్లీ 2018లో తిరిగి అండర్సన్ బౌలింగ్‌లోనే ఒక్కసారి కూడా ఔట్ కాకుండా 593 పరుగులు సాధించి సాలీడ్ రియాక్షన్ ఇచ్చాడు. ఇలా అనేక సందర్భాల్లో కోహ్లీ దూకుడైన ఆట అండర్సన్ ఆకట్టుకుంది. అందుకే భారత్ నుంచి విరాటే తన ఫేవరెట్ అని పేర్కొన్నాడు.


అండర్సన్ ఫేవరెట్ ప్లేయర్లు వీరే..

  • భారత్- విరాట్ కోహ్లీ

  • ఆస్ట్రేలియా- షేన్ వార్న్

  • దక్షిణాఫ్రికా- ఏబీ డివిలియర్స్

  • శ్రీలంక- సనత్ జయసూర్య

  • పాకిస్థాన్- బాబర్ ఆజం

  • న్యూజిలాండ్- టిమ్ సౌథీ

  • ఇంగ్లాండ్- జో రూట్


ఇవి కూడా చదవండి:

ముస్తాఫిజూర్ చేసిన తప్పేంటి? ఉదాహరణలతో వివరించిన ఆకాశ్ చోప్రా

ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ ఔట్.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం!

Updated Date - Jan 04 , 2026 | 09:49 PM