Home » Virat Kohli
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ తాజాగా మరో సెంచరీ చేశాడు. రాయ్‌పూర్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో విరాట్ కోహ్లీ వరుసగా రెండో సెంచరీ చేశాడు. రాంచీలో జరిగిన తొలి మ్యాచ్‌లో 135 పరుగులు చేసిన కోహ్లీ.. అదే ఫామ్‌ను కొనసాగిస్తూ మరో శతకం బాదాడు.
కింగ్ విరాట్ కోహ్లీ మరోసారి తన విశ్వరూపం ప్రదర్శించాడు. వరుసగా రెండో సెంచరీ సాధించాడు. యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ కూడా తొలి శతకంతో మెరిశాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు చెలరేగడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది.
గైక్వాడ్, కోహ్లీ చెలరేగడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. రాయ్‌పూర్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు టీమిండియా బ్యాటర్లు చుక్కలు చూపించారు.
భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుంటేనే ప్రత్యర్థి జట్లు సంతోషపడతాయని అఫ్గాన్ స్టార్ క్రికెటర్ గుర్బాజ్ పేర్కొన్నాడు. వన్డేలకు కూడా వారిద్దరూ రిటైర్ అయితేనే తాను సంతోషిస్తానని వెల్లడించాడు.
రాంచీ వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ లేకపోతే భారత్ ఓడిపోయేదని మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. యువ ఆటగాళ్లు కలిసి 200 పరుగులు కూడా చేయలేకపోయారని, టీమిండియాకు ఇప్పటికీ రో-కోనే ప్రధాన బలం అని విశ్లేషించాడు.
అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగాలంటే దేశవాళీల్లో ఆడాల్సిందేనని సెలక్షన్ కమిటీ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో ఆడబోనని చెప్పినట్లు సమాచారం.
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో విజయం సాధించిన భారత్ జట్టు.. రెండో వన్డే కోసం రాయ్‌పుర్ చేరుకుంది. ఈ క్రమంలో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి చిన్నారులు గులాబీ పూలతో ఘనస్వాగతం పలికారు.
టెస్టుల్లోకి టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రీఎంట్రీ ఇస్తాడంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే రాంచీ వన్డే అనంతరం ఈ వార్తలపై విరాట్ క్లారిటీ ఇచ్చాడు.
రాంచీ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ వన్డేలో విరాట్ సెంచరీ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సెంచరీ బాదాడు. దీంతో భారత్ భారీ స్కోర్ దిశగా వెళ్తోంది.