Share News

రో- కోకు డిమోషన్.. సెంట్రల్ కాంట్రాక్టుల్లో ‘బి గ్రేడ్’?

ABN , Publish Date - Jan 20 , 2026 | 02:37 PM

టీమిండియా వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు బీసీసీఐ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఒకే ఫార్మాట్ ఆడుతున్న కారణంగా వారిని ఏ ప్లస్ కేటగిరీ నుంచి ‘బీ గ్రేడ్’కు డిమోట్ చేసే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాల సమాచారం..

రో- కోకు డిమోషన్.. సెంట్రల్ కాంట్రాక్టుల్లో ‘బి గ్రేడ్’?
Ro-Ko

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు బీసీసీఐ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 2026-27 సీజన్‌కు సంబంధించి సెంట్రల్ కాంట్రాక్టుల్లో కీలక మార్పులు చేసేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఈ క్రమంలో ‘ఏ ప్లస్’ కేటగిరీని పూర్తిగా తొలగించి.. మూడు కేటగిరీలను మాత్రమే ఉంచాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రతిపాదించింది. దీనికి బోర్డు ఆమోదం తెలిపితే రో-కోపై (Ro-Ko) ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది.


రో-కో ఇప్పటికే టెస్టులు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఒకే ఫార్మాట్ ఆడుతున్న కారణంగా వారిని ఏ ప్లస్ కేటగిరీ నుంచి ‘బీ గ్రేడ్’కు డిమోట్ చేసే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఏ ప్లస్ గ్రేడ్‌లో ఉన్న కోహ్లీ, రోహిత్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా ఏడాదికి రూ.7 కోట్ల వేతనం అందుకుంటున్నారు. ఒకవేళ ఏ ప్లస్ గ్రేడ్ రద్దయితే జడేజా, బుమ్రాలను గ్రేడ్ ‘ఏ’కి మార్చే అవకాశముంది. త్వరలో జరగనున్న బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.


అదే సమయంలో ఏ ప్లస్ గ్రేడ్ రద్దయితే కొత్తగా ‘డీ’ గ్రేడ్ ప్రవేశ పెడతారా? అన్న అంశంపైనా చర్చ జరుగుతోంది. 2023–24 సీజన్‌లో ఫాస్ట్ బౌలర్ల కోసం బీసీసీఐ ప్రత్యేక కాంట్రాక్ట్ కేటగిరీని ప్రవేశపెట్టింది. ఉమ్రాన్ మాలిక్, మయాంక్ యాదవ్, ఆకాశ్ దీప్ వంటి వారు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) పరిధిలో ఉండేలా ఈ కాంట్రాక్టులు ఇచ్చారు. ఇదే తరహాలో మరో కొత్త విధానం వస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే.


గతేడాది సెంట్రల్ కాంట్రాక్టులు..

ఏ ప్లస్ కేటగిరీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. వీరు ఏడాదికి రూ.7కోట్ల వేతనం అందుకుంటారు. గ్రేడ్ ఏలో మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, రిషభ్ పంత్ ఉన్నారు. వీరికి రూ.5కోట్లు చెల్లిస్తారు. గ్రేడ్ బీలో సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. వీరికి ఏడాదికి రూ.3కోట్లు చెల్లిస్తారు. గ్రేడ్ సీలో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, రవీ బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముకేశ్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, రజత్ పటీదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాశ్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా ఉండగా.. వీరికి రూ.కోటి చొప్పున చెల్లిస్తారు.


ఇవి కూడా చదవండి:

ముందు బాగా కష్టపడాలి.. వర్క్‌లైఫ్ బ్యాలెన్స్‌పై పంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

సంజయ్ మంజ్రేకర్‌పై వికాస్ కోహ్లీ వ్యంగ్యాస్త్రాలు!

Updated Date - Jan 20 , 2026 | 03:02 PM