Rishabh Pant: ముందు బాగా కష్టపడాలి.. వర్క్‌లైఫ్ బ్యాలెన్స్‌పై పంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:07 PM
టీమిండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ప్రతి ఒక్కరికీ అవసరం అని అభిప్రాయపడ్డాడు. నేటి యువతకు పలు సూచనలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ రిషభ్ పంత్(Rishabh Pant) వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ప్రతి ఒక్కరికీ అవసరం అని అభిప్రాయపడ్డాడు. ముందు బాగా కష్టపడి.. ఆ తర్వాత రిలాక్స్ అవ్వాలని నేటి యువతరానికి సూచించాడు.
‘ముందు మనం బాగా కష్టపడాలి. మన పనిని పిచ్చిగా ప్రేమించాలి. ఆ తర్వాత మనం జీవితంలో ప్రశాంతంగా ఉండటానికి, విశ్రాంతి తీసుకోవడానికి కొంత సమయం కచ్చితంగా దొరుకుతుంది. యువత తమ పరిధులను దాటి ఆలోచించే ప్రయత్నం చేయాలి. ఏదైనా జరిగినా.. దాన్నుంచి కోలుకోవడానికి చాలా సమయం ఉంటుంది. ముందు నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. దాన్నుంచి అద్భుతమైన విషయం బయటకు వస్తుంది. నా మనసులో నేను భారతదేశం కోసం ఆడాలని మాత్రమే కోరుకున్నాను. దేశం కోసం మ్యాచులు ఆడి గెలవాలనేదే నా లక్ష్యం. మిగతావన్నీ తర్వాత విషయాలు.
నా చిన్నతనంలోనే మా నాన్నను కోల్పోయాను. ఈ ఘటన నాకు అత్యంత బాధకరమైనది. అయినా నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. సానుకూల దృక్పథంతో ఆలోచించి ముందుకుసాగాను. కుర్రాడిగా ఉన్నప్పుడు నా ఆర్థిక పరిస్థితిపై దృష్టి పెట్టలేదు. కేవలం ఆటపైనే దృష్టి సారించా. కానీ, కొవిడ్ సమయంలో జీవితం, క్రికెట్‌పై నా విధానంలోనే గణనీయమైన మార్పు వచ్చింది’ అని పంత్ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
ఆటకు వీడ్కోలు పలికిన సైనా నెహ్వాల్