Home » Rishabh Pant
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో రిషభ్ పంత్ తుది జట్టులో తప్పకుండా ఆడతాడని కేఎల్ రాహుల్ స్పష్టం చేశాడు. వికెట్ కీపింగ్ బాధ్యతలు పంత్ తీసుకుంటాడా? లేక తానే కొనసాగుతాడా? అనే విషయంపై ఆదివారం స్పష్టత వస్తుందని చెప్పాడు.
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఈ షూట్‌లో పంత్ చేసిన వ్యాఖ్యలు అందరికీ నవ్వు తెప్పించాయి.
సౌతాఫ్రికాతో స్వదేశంలోనే రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఓటమి తర్వాత భారత జట్టుపై పలు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఈ విషయంపై స్పందించారు.
సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రాంచీ చేరుకున్నాడు. క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ.. కోహ్లీతో పాటు పంత్, రుతురాజ్ గైక్వాడ్‌ను తన నివాసంలో విందుకు ఆహ్వానించాడు.
సౌతాఫ్రికా చేతిలో వైట్ వాష్ తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్.. అభిమానులకు క్షమాపణలు తెలిపాడు. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా తాము రాణించలేదని.. ఈ ఓటమి ద్వారా గుణపాఠాలు నేర్చుకుని మరింత బలంగా తిరిగొస్తామని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు.
గువాహటి వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికా 408 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. రెండు టెస్టులు ఓడటంతో సఫారీలపై భారత్ వైట్‌వాష్‌కు గురైంది. ఈ ఓటమి నేపథ్యంలో టీమిండియా టెస్ట్ తాత్కాలిక కెప్టెన్ రిషభ్ పంత్ స్పందించాడు.
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ నొప్పితో అనూహ్యంగా మైదానాన్ని వీడిన సంగతి తెలిసిందే. తాజాగా గిల్‌ను జట్టులోంచి రిలీజ్ చేశారు. దీంతో కెప్టెన్సీ బాధ్యతలు పంత్ అందుకున్నాడు.
సౌతాఫ్రికాతో ఓటమి తర్వాత టీమిండియా బ్యాటర్ పంత్ స్పందించాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయామని తెలిపాడు. రెండో టెస్టులో బలంగా తిరిగొస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య మూడో రోజు తొలి టెస్ట్ కొనసాగుతుంది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే ఈ పిచ్‌పై బౌలర్లు విజృంభిస్తుండటంతో స్వల్ప లక్ష్యాన్ని కూడా ప్లేయర్లు ఛేదించలేకపోతున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
దాదాపు నాలుగు నెలల తర్వాత గాయం నుంచి కోలుకున్న రిషభ్ పంత్ సౌతాఫ్రికాతో టెస్ట్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును బద్దలు కొట్టాడు.