Ind Vs NZ: నేడే న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. టీమిండియా స్టార్ ప్లేయర్ దూరం!
ABN , Publish Date - Jan 11 , 2026 | 06:44 AM
భారత్-న్యూజిలాండ్ మధ్య నేటి నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే ఓ బ్యాడ్ న్యూస్ అందుతోంది. టీమిండియా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ ఈ వన్డే సిరీస్‌కు దూరమైనట్టు తెలుస్తోంది. శనివారం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బంతి తగలడంతో ఆయనకు బలమైన గాయమైంది. దీంతో ఆయన్ను తప్పించినట్టు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: భారత్-న్యూజిలాండ్ మధ్య నేటి నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ వడోదర వేదికగా జరగనుంది. వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆటను తిరిగి చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ బ్యాడ్ న్యూస్ అందుతోంది. టీమిండియా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్(Rishabh Pant) ఈ వన్డే సిరీస్‌కు దూరమైనట్టు తెలుస్తోంది. శనివారం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బంతి తగలడంతో ఆయనకు బలమైన గాయమైంది. దీంతో ఆయన్ను తప్పించినట్టు సమాచారం.
పంత్ స్థానంలో..?
పంత్ గాయంపై బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే పంత్ ఆడలేకపోతే.. ఆ స్థానంలో ఎవరిని తీసుకుంటారనే దానిపై చర్చ మొదలైంది. జట్టులో పంత్‌కు బ్యాకప్‌గా కేఎల్ రాహుల్ ఉన్నాడు. వాస్తవానికి కివీస్‌తో వన్డే సిరీస్‌కు కూడా పంత్‌ను పక్కన పెట్టి దేశవాళీల్లో రాణిస్తున్న ఇషాన్ కిషన్(Ishan Kishan)కు అవకాశం ఇస్తారని అంతా భావించారు. కానీ సెలక్టర్లు పంత్ వైపే మొగ్గు చూపారు. తాజాగా పంత్ గాయపడటంతో ఇషాన్ కిషన్‌ను పంత్ స్థానంలో తీసుకునే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
సునామీని తలపించిన సూర్యవంశీ బ్యాటింగ్
కెమెరామెన్‌పై స్మృతి మందాన అసహనం.. వీడియో వైరల్