Women Premier League 2026: ముంబై భళా ఢిల్లీ డీలా
ABN , Publish Date - Jan 11 , 2026 | 05:36 AM
హర్మన్‌ప్రీత్ కౌర్ (42 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74 నాటౌట్), నాట్ సివర్ బ్రంట్ (70) అర్ధ శతకాలతోపాటు పేసర్ నికోలా క్యారీ (3/37) నిప్పులు చెరగడంతో..
డబ్ల్యూపీఎల్‌లో నేడు
ఢిల్లీ X గుజరాత్ (రా. 7.30)
హర్మన్‌సేన ఆల్‌రౌండ్ షో
50 పరుగులతో విజయం
నవీ ముంబై: హర్మన్‌ప్రీత్ కౌర్ (42 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74 నాటౌట్), నాట్ సివర్ బ్రంట్ (70) అర్ధ శతకాలతోపాటు పేసర్ నికోలా క్యారీ (3/37) నిప్పులు చెరగడంతో.. డిఫెండింగ్ చాంప్ ముంబై ఇండియన్స్ బోణీ చేసింది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్యూపీఎల్)లో శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 50 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. ఆరంభ మ్యాచ్‌లో ఓడిన హర్మన్‌ప్రీత్ సేన.. ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో కదం తొక్కింది. తొలుత ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 195/4 స్కోరు చేసింది. అరంగేట్రం పేసర్ నందని శర్మ రెండు వికెట్లు పడగొట్టగా.. శ్రీచరణి, చినెల్లీ హెన్రీ చెరో వికెట్ తీశారు. బ్రంట్, హర్మన్ మూడో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు భారీ స్కోరు అందించారు. అనంతరం ఛేదనలో ఢిల్లీ జట్టు 19 ఓవర్లలో 145 పరుగులకే కుప్పకూలింది. హెన్రీ (56) ఒంటరి పోరాటం చేయగా.. షఫాలీ (8), వోల్వార్ట్ (9), కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ (1) సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు. అమేలియా కెర్ మూడు, బ్రంట్ రెండు వికెట్లు పడగొట్టారు. హర్మన్‌ప్రీత్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచింది.
సంక్షిప్త స్కోర్లు
ముంబై: 20 ఓవర్లలో 195/4 (హర్మన్‌ప్రీత్ 74 నాటౌట్, బ్రంట్ 70; నందని శర్మ 2/26, శ్రీచరణి 1/45).
ఢిల్లీ: 19 ఓవర్లలో 145 ఆలౌట్ (హెన్రీ 56, నిక్కీ ప్రసాద్ 12; కెర్ 3/24, క్యారీ 3/37).
ఇవి కూడా చదవండి:
సునామీని తలపించిన సూర్యవంశీ బ్యాటింగ్
కెమెరామెన్‌పై స్మృతి మందాన అసహనం.. వీడియో వైరల్