Vaibhav Suryavanshi: సునామీని తలపించిన సూర్యవంశీ బ్యాటింగ్
ABN , Publish Date - Jan 10 , 2026 | 07:07 PM
భారత యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే సౌతాఫ్రికా టూర్‌లో తన సత్తా ఏంటో చూపాడు. తాజాగా మరోసారి విధ్వంసకర బ్యాటింగ్ ఆడాడు. అండర్-19 ప్రపంచకప్ 2026 సన్నాహకాల్లో భాగంగా యూరప్ దేశమైన స్కాట్లాండ్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో వైభవ్ విధ్వంసం సృష్టించాడు.
స్పోర్ట్స్ డెస్క్: భారత యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే సౌతాఫ్రికా టూర్‌లో తన సత్తా ఏంటో చూపిన వైభవ్.. తాజాగా మరోసారి విధ్వంసకర బ్యాటింగ్ ఆడాడు. అండర్-19 ప్రపంచకప్ 2026 సన్నాహకాల్లో భాగంగా యూరప్ దేశమైన స్కాట్లాండ్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో వైభవ్ విధ్వంసం సృష్టించాడు. స్కాట్లాండ్ బౌలర్లను వైభవ్ ఉతికారేశాడు. దాదాపు 192 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి భారత్ కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. 50 బంతుల్లో 96 పరుగులు చేసి.. తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు.
ఇక మ్యాచ్(India U19 vs Scotland) విషయానికి వస్తే.. టాస్ గెలిచిన స్కాట్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన యువ భారత్ నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 374 పరుగులు చేసింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ స్కాట్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆరంభం నుంచి స్కాట్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కేవలం 27 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 50 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో 96 పరుగులు చేశాడు. కేవలం 4 పరుగుల దూరంలో సెంచరీని చేజార్చుకున్నాడు. 96 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మను సరస్వత్ బౌలింగ్ లో ఔటయ్యాడు.
వైభవ్ తోపాటు విహాన్ మల్హోత్రా(77) కూడా రాణించాడు. అయితే గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చిన కెప్టెన్ అయూష్ మాత్రం తీవ్ర నిరాశపరిచాడు. మాత్రే కేవలం 22 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆరోన్ జార్జ్ 61, అభిజ్ఞాన్ కుందు 55 పరుగులు చేశారు. ఇటీవలే దక్షిణాఫ్రికా పర్యటనలో జరిగిన యూత్ వన్డే సిరీస్‌లోనూ వైభవ్ అద్భుతాలు చేశాడు. రెండో వన్డేలో కేవలం 74 బంతుల్లో 127 పరుగులు చేసి, మూడో వన్డేలో 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. స్కాట్లాండ్ మ్యాచ్ తర్వాత జనవరి 12న ఇంగ్లాండ్‌తో భారత్ వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఇక యూత్ వరల్డ్‌కప్(Youth World Cup) ప్రధాన టోర్నీ జనవరి 15 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో భారత్, అమెరికా జట్లు తలపడనున్నాయి. గ్రూప్-ఏలో భారత్ సహా అమెరికా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
కెమెరామెన్‌పై స్మృతి మందాన అసహనం.. వీడియో వైరల్
అర్ష్‌దీప్ సింగ్‌ను ఇమిటేట్ చేసిన విరాట్.. ఫన్నీ వీడియో వైరల్!