Cyber Crime Hyderabad: మాజీ ఐపీఎస్ భార్యను మోసగించిన సైబర్ కేటుగాళ్లు.. రూ.2.58 కోట్ల మోసం
ABN , Publish Date - Jan 10 , 2026 | 05:54 PM
మాజీ ఐపీఎస్ భార్యకు టోకరా వేసిన సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.2.58 కోట్లు దోచుకున్నారు. దీంతో, బాధితురాలు తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్: సైబర్ కేటుగాళ్ల బారిన పడ్డ ఓ మాజీ ఐపీఎస్ అధికారి భార్య ఏకంగా రూ.2.58కోట్ల మేర నష్టపోయారు. తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరిట సైబర్ నేరగాళ్లు మోసానికి తెరలేపారు. ట్రేడింగ్‌లో చిట్కాల చెబుతామని మొదట వాట్సాప్ మెసేజ్ పంపించారు. తమ చిట్కాలు పాటిస్తే ట్రేడింగ్‌లో 500 శాతం లాభాలు వస్తాయని అన్నారు. సెబీ సర్టిఫైడ్ డాక్యుమెంట్స్ అంటూ కొన్ని నకిలీ కాపీలను కూడా చూపించారు. ఈ విషయాలపై అవగాహన లేకపోవడంతో ఆమె తన భర్త మొబైల్ నెంబర్‌ను వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేయించారు (CyberCrime, Former IPS's Wife Duped).
ఈ క్రమంలో సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మిన బాధితురాలు భారీగా పెట్టుబడులు పెట్టారు. 19 లావాదేవీల్లో రూ.2.58 కోట్ల మేర బదిలీ చేశారు. ఆ తరువాత పెట్టుబడులను నిలిపివేయడంతో నిందితులు బెదిరింపులకు దిగారు. ఇన్వెస్ట్‌మెంట్స్‌ను నిలిపివేస్తే అప్పటివరకూ పెట్టిన పెట్టుబడి పోతుందని బెదిరించారు. ఈ క్రమంలో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు చివరకు పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
ఇవీ చదవండి:
హైదరాబాద్-విజయవాడ మధ్య మరో 10 సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్
మహిళా అధికారుల బదిలీపై మంత్రి కోమటిరెడ్డి ఏం చెప్పారంటే?