Share News

Sankranti Special Trains: హైదరాబాద్-విజయవాడ మధ్య మరో 10 సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్

ABN , Publish Date - Jan 10 , 2026 | 03:37 PM

సంక్రాంతి వేళ ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే మరో 10 ప్రత్యేక రైళ్లను అనౌన్స్ చేసింది. రేపటి నుంచి (జనవరి 11) ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ.. విజయవాడ నుంచి హైదరాబాద్ మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.

Sankranti Special Trains: హైదరాబాద్-విజయవాడ మధ్య మరో 10 సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్
Sankranti Special Trains 2026

సికింద్రాబాద్, జనవరి 10: ఈ ఏడాది (2026) సంక్రాంతి రద్దీ దృష్ట్యా సౌత్ సెంట్రల్ రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లు నడపనుంది. హైదరాబాద్-విజయవాడ మధ్య మరో 10 సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్ వివరాలను దక్షిణ మధ్య రైల్వే కొంచెంసేపటి క్రితం ప్రకటించింది. ఛైర్ కార్, జనరల్ బోగీలతో నడిచే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

ఛైర్ కార్ బోగీల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించారు. రిజర్వేషన్ చేసుకోని వారి కోసం రైలులో సగానికి పైగా జనరల్ బోగీల ఏర్పాటు చేయడం విశేషం. పండగకు ముందు, తర్వాతి రోజుల్లో ఈ ప్రత్యేక రైళ్లు వివిధ మార్గాల్లో రాకపోకలు సాగిస్తాయి.


సంక్రాంతి ప్రత్యేక రైళ్ల వివరాలు:

  • ఈనెల 11, 12, 13, 18, 19 తేదీల్లో ఉదయం 6.10 గంటలకు హైదరాబాద్ నుంచి విజయవాడకు సంక్రాంతి ప్రత్యేక రైళ్లు

  • ఈనెల 10, 11, 12, 17, 19 తేదీల్లో మధ్యాహ్నం 2.40 గంటలకు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు సంక్రాంతి ప్రత్యేక రైళ్లు


సంక్రాంతి పండుగ వేళ ఇప్పటికే నడుస్తున్న 150కిపైగా అదనపు ట్రైన్స్‌కు ఇవి అదనం. అయితే, ఇవాళ ప్రకటించిన ప్రత్యేక రైళ్లు.. కేవలం విజయవాడ వరకు మాత్రమే నడుపుతున్నారు. ఇప్పటికే నడుస్తున్న సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌ మాత్రం నర్సాపురం, కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, మచిలీపట్నం, నాందేడ్‌ వరకూ నడుస్తున్నాయి.

ప్రత్యేక రైళ్ల నిర్వహణ విషయంలోనూ దక్షిణ మధ్య రైల్వే శాఖ జాగ్రత్తలు తీసుకుంది. చాలా ట్రైన్స్‌ను చర్లపల్లి నుంచి బయల్దేరేలా షెడ్యూల్ చేసింది. దీంతో పునర్నిర్మాణంలో ఉన్న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌పై భారం పడకుండా జాగ్రత్త పడింది. ఒక్క చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచే కాకుండా కొన్ని రైళ్లు బేగంపేట్, హైటెక్ సిటీ, లింగంపల్లి నుంచీ ఎక్కేలా ప్లాన్ చేసింది.


ఇదిలా ఉంటే, సంక్రాంతి పండుగను ఆనందంగా తమ సొంత ఊర్లలో జరుపుకునేందుకు నగరవాసులు భారీ సంఖ్యలో పల్లెలకు క్యూకడుతున్నారు. దీంతో టోల్ ప్లాజాలు, విజయవాడ వైపు వెళ్లే రోడ్లు ట్రాఫిక్ తో కిటకిటలాడుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి...

రెయిన్ అలర్ట్.. వాయుగుండం ప్రభావంతో వర్షాలు..

దుర్గగుడిలో అపచారం.. ఏం జరిగిందంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 10 , 2026 | 05:14 PM