Women Premier League 2026: గుజరాత్ బోణీ పోరాడి ఓడిన యూపీ
ABN , Publish Date - Jan 11 , 2026 | 05:33 AM
మహిళల ప్రీమియర్ లీగ్‌లో శనివారం జరిగిన తొలి మ్యాచ్ ఉత్కంఠ రేపింది. భారీ స్కోర్లు నమోదైన ఈ పోరులో గుజరాత్ జెయింట్స్ 10 పరుగులతో...
నవీ ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్‌లో శనివారం జరిగిన తొలి మ్యాచ్ ఉత్కంఠ రేపింది. భారీ స్కోర్లు నమోదైన ఈ పోరులో గుజరాత్ జెయింట్స్ 10 పరుగులతో గెలిచింది. మొదట గుజరాత్ 20 ఓవర్లలో 207/4 స్కోరు చేసింది. కెప్టెన్ ఆష్లీ గార్డ్‌నర్ (41 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 65), అనుష్క శర్మ (30 బంతుల్లో 7 ఫోర్లతో 44), సోఫీ డివైన్ (20 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38), వేర్హామ్ (10 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 27 నాటౌట్) ధనాధన్ బ్యాటింగ్ చేశారు. ఎకెల్‌స్టోన్ రెండు వికెట్లు పడగొట్టింది. ఛేదనలో యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 197/8 స్కోరుతో తుదికంటా పోరాడినా పరాజయం తప్పలేదు. లిచ్‌ఫీల్డ్ (40 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 78) చెలరేగింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (27 బంతుల్లో 5 ఫోర్లతో 30), చివర్లో ఆశా శోభన (10 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27 నాటౌట్) దుమ్ము రేపింది. రేణుకా సింగ్, వేర్హామ్, డివైన్ తలా రెండేసి వికెట్లు తీశారు. వేర్హామ్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచింది.
సంక్షిప్తస్కోర్లు
గుజరాత్ జెయింట్స్: 20 ఓవర్లలో 207/4 (గార్డ్‌నర్ 65, అనుష్క 44, సోఫీ డివైన్ 38, వేర్హామ్ 27 నాటౌట్, ఎకెల్‌స్టోన్ 2/32);
యూపీ వారియర్స్: 20 ఓవర్లలో 197/8 (లిచ్‌ఫీల్డ్ 78, లానింగ్ 30, ఆశా శోభన 27 నాటౌట్, రేణుకా సింగ్ 2/25, జార్జియా వేర్హామ్ 2/30, సోఫీ డివైన్ 2/55).
ఇవి కూడా చదవండి:
సునామీని తలపించిన సూర్యవంశీ బ్యాటింగ్
కెమెరామెన్‌పై స్మృతి మందాన అసహనం.. వీడియో వైరల్