Share News

Vikas Kohli: సంజయ్ మంజ్రేకర్‌పై వికాస్ కోహ్లీ వ్యంగ్యాస్త్రాలు!

ABN , Publish Date - Jan 20 , 2026 | 11:29 AM

టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ విరాట్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ పరోక్షంగా కౌంటర్లు ఇస్తూ వస్తున్నాడు. తాజాగా.. మంజ్రేకర్‌పై వికాస్ మరోసారి ఫైర్ అయ్యాడు. సోషల్ మీడియా వేదికగా అతడిపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించాడు.

Vikas Kohli: సంజయ్ మంజ్రేకర్‌పై వికాస్ కోహ్లీ వ్యంగ్యాస్త్రాలు!
Vikas Kohli

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. కష్టమైన టెస్ట్ క్రికెట్ ఫార్మాట్‌ను వదిలేసి టాపార్డర్ బ్యాటర్‌కు సులువైన వన్డే ఫార్మాట్లో ఆడటం ఏంటని సంజయ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ(Vikas Kohli) పరోక్షంగా కౌంటర్లు ఇస్తూ వస్తున్నాడు. తాజాగా మంజ్రేకర్‌పై వికాస్ మరోసారి ఫైర్ అయ్యాడు. సోషల్ మీడియా వేదికగా అతడిపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించాడు.


న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. దీంతో మంజ్రేకర్‌(Sanjay Manjrekar)ను టార్గెట్ చేస్తూ వికాస్ మరో పోస్ట్ పెట్టాడు. ‘మిస్టర్ క్రికెట్ ఎక్స్‌పర్ట్.. మీ దగ్గర అత్యంత సులువైన ఫార్మాట్ గురించి ఏమైనా సూచనలు ఉన్నాయా? అయినా అవి చేయాలంటే మీరు మైదానంలో ఉండాలి కదా? ఏదేమైనా.. చెప్పడం సులభమే.. కానీ చేయడమే కష్టం’ అంటూ వికాస్ ‘థ్రెడ్స్’ ఖాతాలో రాసుకొచ్చాడు.


మంజ్రేకర్ ఏమన్నారంటే..

విరాట్ కోహ్లీ టెస్ట్, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డే క్రికెట్లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే విరాట్ తన లోపాలను సరిదిద్దుకోకుండా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడని.. టాపార్డర్ బ్యాటర్‌కు ఎంతో సులువైన వన్డేల్లో మాత్రం కొనసాగుతున్నాడని మంజ్రేకర్ కామెంట్స్ చేశాడు. ఫ్యాబ్-4లోని జో రూట్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ పొరపాట్లను సరిచేసుకుని టెస్టుల్లో మరింత గొప్ప పేరు తెచ్చుకుంటూ రాణిస్తున్న తరుణంలో కోహ్లీ వీడ్కోలు పలకడం పద్ధతి కాదని అన్నాడు. రిటైర్మెంట్ తీసుకోవాలనుకున్నప్పుడు అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలకాల్సిందని వ్యాఖ్యానించాడు.


ఇవి కూడా చదవండి:

చరిత్ర సృష్టించిన ఆర్సీబీ

ఆటకు వీడ్కోలు పలికిన సైనా నెహ్వాల్

Updated Date - Jan 20 , 2026 | 11:36 AM