WPL 2026: చరిత్ర సృష్టించిన ఆర్సీబీ
ABN , Publish Date - Jan 20 , 2026 | 10:04 AM
మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచిన తొలి జట్టుగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. సోమవారం గుజరాత్ జెయింట్స్‌పై 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన ఆర్సీబీ.. ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ఇదే కాకుండా డబ్ల్యూపీఎల్ చరిత్రలో వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచిన తొలి జట్టుగా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
వడోదరలోని బీసీఏ స్టేడియం కోటాంబిలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ(RCB) ఆది నుంచి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. టోర్నీ(WPL 2026) నవీ ముంబై నుంచి వడోదరకు మారిన తర్వాత జరిగిన తొలి మ్యాచ్‌లోనే బెంగళూరు టీమ్ సత్తా చాటింది. గత సీజన్‌లో ఆఖరి మ్యాచ్ గెలవడంతో పాటు.. ఈ సీజన్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచి వరుసగా ఆరు మ్యాచుల్లో విజయం సాధించిన ఏకైక జట్టుగా ఆర్సీబీ రికార్డులకెక్కింది.
ఈ సీజన్‌లో ఆడిన ఐదు మ్యాచుల్లోనే గెలిచి 10 పాయింట్లు సాధించిన ఆర్సీబీ.. ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. గతంలో ముంబై ఇండియన్స్ మహిళల జట్టు రెండు సార్లు(2023, 2023-24) వరుసగా ఐదు విజయాలు సాధించగా.. ఇప్పుడు ఆ రికార్డును అధిగమిస్తూ ఆర్సీబీ అగ్రస్థానానికి చేరుకుంది.
డబ్ల్యూపీఎల్‌లో వరుస విజయాలు:
6 – ఆర్సీబీ మహిళలు (2025-26)
5 – ముంబై ఇండియన్స్ మహిళలు (2023)
5 – ముంబై ఇండియన్స్ మహిళలు (2023-24)
5 – ఆర్సీబీ మహిళలు (2024-25)
4 – ఢిల్లీ క్యాపిటల్స్ మహిళలు (2024)
ఇవి కూడా చదవండి:
రో-కో మళ్లీ బరిలోకి దిగేదెప్పుడంటే.?
అన్నిసార్లూ భారీ స్కోర్లు చేయడం సాధ్యపడదు.. రోహిత్ ఫామ్‌పై గిల్ స్పందనిదే..