Rohit Sharma: అన్నిసార్లూ భారీ స్కోర్లు చేయడం సాధ్యపడదు.. రోహిత్ ఫామ్‌పై గిల్ స్పందనిదే..
ABN , Publish Date - Jan 19 , 2026 | 01:07 PM
టీమిండియా వెటరన్ ప్లేయర్ రోహిత్ శర్మ ఈ సిరీస్‌లో పెద్దగా రాణించలేదు. అయితే.. మ్యాచ్ అనంతరం రోహిత్ ఫామ్‌పై ఎదురైన ప్రశ్నకు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పందించాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో రోహిత్ భారీ స్కోర్లు చేయలేకపోయినా మంచి ఫామ్‌లోనే ఉన్నాడని చెప్పాడు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 1-2 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. టీమిండియా వెటరన్ ప్లేయర్ రోహిత్ శర్మ ఈ సిరీస్‌లో పెద్దగా రాణించలేదు. అయితే మ్యాచ్ అనంతరం రోహిత్ ఫామ్‌పై ఎదురైన ప్రశ్నకు కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) స్పందించాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో రోహిత్ భారీ స్కోర్లు చేయలేకపోయినా మంచి ఫామ్‌లోనే ఉన్నాడని చెప్పాడు.
‘రోహిత్ భాయ్(Rohit Sharma) ఆస్ట్రేలియా సిరీస్ నుంచి మంచి ఫామ్‌లో ఉన్నాడు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లోనూ అదే జోరు కొనసాగించాడు. ప్రస్తుతం కూడా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ప్రతీ ఆరంభాన్ని భారీ స్కోర్లుగా మార్చడం సాధ్యం కాదు. తొలి రెండు వన్డేల్లో అతడికి మంచి ఆరంభాలు లభించాయి. ఒక బ్యాటర్‌గా ఆ ఆరంభాలను సెంచరీలుగా మార్చాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ ప్రతిసారీ అది సాధ్యపడదు’ అని గిల్ వివరించాడు. కాగా ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ మూడు మ్యాచుల్లో కలిపి 61 పరుగులే చేశాడు. మూడో వన్డేలో 11 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు.
వాళ్లు కూడా..
‘ఈ సిరీస్‌లో జడేజా విఫలమైనా.. మంచి టచ్‌లోనే ఉన్నాడు. బ్యాటింగ్ పరంగానూ పర్వాలేదనిపిస్తున్నాడు. జడేజా విషయం పక్కన పెడితే నాతో సహా టీమిండియా బ్యాటర్లంతా మాకు లభించిన ఆరంభాలను భారీ స్కోర్లుగా మార్చలేకపోయాం. సాధారణంగా భారత్‌లో ఆడేటప్పుడు హై స్కోరింగ్ మ్యాచులు చూస్తుంటాం. ఒకవేళ బ్యాటర్లకు మంచి ఆరంభాలు లభించి, వాటిని కనీసం ఇద్దరు బ్యాటర్లయినా పెద్ద స్కోర్లుగా మార్చలేకపోతే విజయం సాధించడం కష్టమవుతుంది. అప్పుడప్పుడు ఇలాంటి ఫలితాలు కూడా ఎదురవుతుంటాయి. కుల్దీప్ యాదవ్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. ఈ సిరీస్‌లో అతడు ఆశించిన స్థాయిలో వికెట్లు తీయలేకపోయాడు. కానీ ఇలాంటి వైఫల్యాలే గుణపాఠాలు నేర్పుతాయి’ అని గిల్ చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి:
భారత్ ఓటమి.. హెడ్ కోచ్ గంభీర్‌పై విమర్శల వెల్లువ
అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు: సునీల్ గావస్కర్