Share News

Sunil Gavaskar: అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు: సునీల్ గావస్కర్

ABN , Publish Date - Jan 19 , 2026 | 10:19 AM

ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 41 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. అయితే స్టార్ ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా అర్ధ శతకంతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్.. హర్షిత్ రాణా బ్యాటింగ్‌పై మాట్లాడాడు.

Sunil Gavaskar: అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు: సునీల్ గావస్కర్
Sunil Gavaskar

ఇంటర్నెట్ డెస్క్: ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 41 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను కివీస్ జట్టు 2-1 తేడాతో దక్కించుకుంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ చేసినా జట్టుకు ఓటమి తప్పలేదు. అయితే.. స్టార్ ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా అర్ధ శతకంతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులో ఉన్నంత సేపు భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్(Sunil Gavaskar).. హర్షిత్ రాణా బ్యాటింగ్‌పై మాట్లాడాడు. అతడు అద్భుతంగా ఆడాడంటూ ప్రశంసించాడు.


‘హర్షిత్ రాణా(Harshith Rana) చాలా చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. ఏమాత్రం కంగారు పడకుండా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఎలాంటి అంచనాలు లేకుండా క్రీజులోకి వచ్చి కీలక సమయంలో పరుగులు రాబట్టాడు. షార్ట్ పిచ్ బంతులను చక్కగా ఎదుర్కొన్నాడు. కళ్లు చెదిరే సిక్సులూ కొట్టాడు. అది నన్ను ఎంతో ఆకట్టుకుంది’ అని సన్నీ తెలిపాడు.


న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో హర్షిత్ రాణా 43 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 52 పరుగులు సాధించాడు. ఏడో వికెట్‌కు విరాట్ కోహ్లీతో కలిసి 69 బంతుల్లోనే 99 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరూ క్రీజులో ఉన్నంతవరకు టీమిండియా గెలుస్తుందనే అభిమానులు ఆశించారు. కానీ దురదృష్టవశాత్తూ వేగంగా పరుగులు సాధించే క్రమంలో హర్షిత్‌ రాణా పెవిలియన్‌కు చేరాడు. తర్వాత చేయాల్సిన పరుగుల పరంగా ఒత్తిడి పెరగడంతో విరాట్‌ కోహ్లీ కూడా వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో టీమిండియా ఈ మ్యాచ్‌ను, 1-2 తేడాతో సిరీస్‌నూ కోల్పోవాల్సి వచ్చింది.


ఇవి కూడా చదవండి..

మిచెల్‌ను మైదానం నుంచి బయటకు నెట్టిన కోహ్లీ.. ఫన్నీ వీడియో వైరల్

అథర్వ తైడే సెంచరీ.. సౌరాష్ట్ర లక్ష్యం 318

Updated Date - Jan 19 , 2026 | 10:37 AM