New Zealand Create History: కివీస్ కొత్త చరిత్ర
ABN , Publish Date - Jan 19 , 2026 | 03:16 AM
ఒకటా.. రెండా.. దాదాపు నాలుగు దశాబ్దాల నిరీక్షణకు న్యూజిలాండ్ జట్టు ముగింపు పలికింది. 1988 నుంచి ద్వైపాక్షిక వన్డే సిరీస్ కోసం భారత పర్యటనకు వచ్చిన ప్రతీసారి...
2-1తో భారత గడ్డపై తొలి సిరీస్
మూడో వన్డేలో విజయం
మిచెల్, ఫిలిప్స్ శతక మోత
విరాట్ సెంచరీ వృధా
ఒకటా.. రెండా.. దాదాపు నాలుగు దశాబ్దాల నిరీక్షణకు న్యూజిలాండ్ జట్టు ముగింపు పలికింది. 1988 నుంచి ద్వైపాక్షిక వన్డే సిరీస్ కోసం భారత పర్యటనకు వచ్చిన ప్రతీసారి పరాజయ భారంతోనే వెనుదిరిగిన కివీ.. ఈమారు చరిత్ర సృష్టించింది. పూర్తిస్థాయి జట్టుతో రాకపోయినా.. అందుబాటులో ఉన్న వనరులనే సద్వినియోగం చేసుకుని టీమిండియాను 2-1తో కంగుతినిపించింది. ఆదివారం జరిగిన ఆఖరిదైన మూడో వన్డేలో కివీస్ తరఫున డారిల్ మిచెల్, ఫిలిప్స్ సెంచరీలతో కదం తొక్కగా.. ఛేదనలో విరాట్ కోహ్లీ శతక పోరాటం సరిపోలేదు. ఫలితంగా భారత్‌ను ఓడించి న్యూజిలాండ్ సిరీస్‌ను సొంతం చేసుకుంది.
ఇండోర్: భారత్‌తో మూడు వన్డేల సిరీ్‌సను న్యూజిలాండ్ 2-1తో చేజిక్కించుకుంది. కివీ్‌సకు భారతగడ్డపై ఇదే తొలి వన్డే సిరీస్ విజయం కావడం విశేషం. మూడో వన్డేలో కివీస్ గెలుపులో డారిల్ మిచెల్ (131 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 137), గ్లెన్ ఫిలిప్స్ (88 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 106) సెంచరీలతో కీలక పాత్ర పోషించారు. భారత్ భారీ ఛేదనలో విరాట్ కోహ్లీ (108 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 124) శతక పోరాటంతో చివరి వరకు నిలిచినా ఫలితం లేకపోయింది. దీంతో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో కివీస్ 41 రన్స్‌తో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 337 పరుగులు చేసింది. అర్ష్‌దీప్, హర్షిత్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో భారత్ 46 ఓవర్లలో 296 రన్స్‌కు ఆలౌటైంది. హర్షిత్ (52), నితీశ్ (53) అర్ధసెంచరీలతో రాణించారు. క్లార్క్, ఫౌక్స్‌లకు మూడేసి, లెనాక్స్‌కు 2 వికెట్లు దక్కాయి. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా మిచెల్ నిలిచాడు.
విరాట్ పోరాటం: భారీ ఛేదనలో విరాట్ కోహ్లీ శతక పోరాటంతో ఆకట్టుకున్నాడు. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా క్రీజులో పట్టు వదలకుండా నిలిచాడు. తనకు నితీశ్ నుంచి సహకారం లభించడంతో ఐదో వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యం లభించింది. చివర్లో హర్షిత్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఏడో వికెట్‌కు ఏకంగా 99 రన్స్ సమకూరడంతో విజయంపై ఆశలు చిగురించాయి. కానీ కివీస్ బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీసి మ్యాచ్‌ను వశం చేసుకున్నారు. ఓపెనర్ రోహిత్ (11) ఈసారీ విఫలం కాగా.. కెప్టెన్ గిల్ (23) జోరు కాసేపే అయ్యింది. వీరికి తోడు శ్రేయాస్ (3), రాహుల్ (1) ఇలా వచ్చి అలా వెళ్లడం దెబ్బతీసింది. ఈ స్థితిలో విరాట్-నితీశ్ కివీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. నితీశ్ ఆరంభంలో ఆచితూచి ఆడాడు. ఆ తర్వాత పుంజుకుని వన్డేల్లో తొలి ఫిఫ్టీని కూడా పూర్తి చేసుకున్నాడు. అయితే కాసేపటికే అతడిని క్లార్క్ అవుట్ చేయడం, జడేజా (12) విఫలం కావడంతో కివీస్ పైచేయి సాధించింది. కానీ తొమ్మిదో నెంబర్ బ్యాటర్ హర్షిత్ ఎడాపెడా షాట్లు బాదాడు. అటు కోహ్లీ 91 బంతుల్లోనే కెరీర్‌లో 54వ సెంచరీ పూర్తి చేశాడు. 43వ ఓవర్‌లో హర్షిత్ 4,6 విరాట్ 6తో 21 రన్స్ సమకూరాయి. అయితే వరుస బంతుల్లో హర్షిత్, సిరాజ్ (0)ను ఫౌక్స్ అవుట్ చేయగా.. మరో ఓవర్ వ్యవధిలోనే విరాట్, కుల్దీప్ వెనుదిరిగారు. దీంతో మరో 24 బంతులుండగానే కివీస్ మ్యాచ్‌ను విజయంతో ముగించింది.

శతకాల బాదుడు: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఇన్నింగ్స్‌లో మరోసారి డారిల్ మిచెల్ కీలకంగా నిలిచాడు. ఈసారి అతడికి ఫిలిప్స్ నుంచి సహకారం లభించింది. దాదాపు 31 ఓవర్లపాటు క్రీజులో ఆధిపత్యం ప్రదర్శించడమే కాకుండా ఇద్దరూ శతకాలతో చెలరేగారు. వీరి జోరుతో నాలుగో వికెట్‌కు ఏకంగా 219 పరుగుల భారీ భాగస్వామ్యం ఏర్పడడం విశేషం. అంతకుముందు సిరీ్‌సలో తొలి మ్యాచ్ ఆడిన పేసర్ అర్ష్‌దీప్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే ఓపెనర్ యంగ్‌ను డకౌట్ చేశాడు. మరో ఓపెనర్ కాన్వే (5)ను హర్షిత్ మూడో ఓవర్‌లో అవుట్ చేయగా.. మిచెల్-యంగ్ జోడీ మూడో వికెట్‌కు 53 పరుగులు జోడించారు. ఆ తర్వాత ఫిలిప్స్ ఆరంభంలో కాస్త నెమ్మదిగానే ఆడినా.. కుదురుకున్నాక భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అటు మిచెల్ అసాధారణ ఫామ్ కొనసాగిస్తూ సిరీ్‌సలో వరుసగా రెండో శతకం అందుకున్నాడు. చివరికి 44వ ఓవర్‌లో ఫిలిప్స్‌ను అర్ష్‌దీప్ అవుట్ చేయడంతో భారత్‌కు రిలీఫ్ దక్కింది. తర్వాతి ఓవర్‌లోనే మిచెల్ వెనుదిరగడంతో చివరి వికెట్లు వేగంగా నేలకూలాయి.
స్కోరుబోర్డు
న్యూజిలాండ్: కాన్వే (సి) రోహిత్ (బి) హర్షిత్ 5, నికోల్స్ (బి) అర్ష్‌దీప్ 0, యంగ్ (సి) జడేజా (బి) హర్షిత్ 30, మిచెల్ (సి) కుల్దీప్ (బి) సిరాజ్ 137, ఫిలిప్స్ (సి) రాహుల్ (బి) అర్ష్‌దీప్ 106, బ్రేస్‌వెల్ (నాటౌట్) 28, హేయ్ (ఎల్బీ) కుల్దీప్ 2, ఫౌక్స్ (సి) కుల్దీప్ (బి) అర్ష్‌దీప్ 10, క్లార్క్ (బి) హర్షిత్ 11, జేమిసన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 50 ఓవర్లలో 337/8. వికెట్ల పతనం: 1-5, 2-5, 3-58, 4-277, 5-283, 6-286, 7-304, 8-327. బౌలింగ్: అర్ష్‌దీప్ 10-1-63-3, హర్షిత్ 10-0-84-3, సిరాజ్ 10-0-43-1, నితీశ్ 8-0-53-0, కుల్దీప్ 6-0-48-1, జడేజా 6-0-41-0.
భారత్: రోహిత్ (సి) క్లార్క్ (బి) ఫౌక్స్ 11, గిల్ (బి) జేమిసన్ 23, విరాట్ (సి) మిచెల్ (బి) క్లార్క్ 124, శ్రేయాస్ (సి) ఫౌక్స్ (బి) క్లార్క్ 3, రాహుల్ (సి) ఫిలిప్స్ (బి) లెనాక్స్ 1, నితీశ్ (సి) యంగ్ (బి) క్లార్క్ 53, జడేజా (సి) యంగ్ (బి) లెనాక్స్ 12, హర్షిత్ (సి) నికోల్స్ (బి) ఫౌక్స్ 52, సిరాజ్ (సి) హేయ్ (బి) ఫౌక్స్ 0, కుల్దీప్ (రనౌట్) 5, అర్ష్‌దీప్ (నాటౌట్) 4, ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 46 ఓవర్లలో 296 ఆలౌట్. వికెట్ల పతనం: 1-28, 2-45, 3-68, 4-71, 5-159, 6-178, 7-277, 8-277, 9-292, 10-296. బౌలింగ్: జేమిసన్ 9-0-58-1, ఫౌక్స్ 9-0-77-3, క్లార్క్ 9-0-54-3, లెనా క్స్ 10-0-42-2, మిచెల్ 1-0-10-0, ఫిలిప్స్ 8-0-54-0.
1
ఒకే వన్డేలో భారత జట్టుపై ఇద్దరు న్యూజిలాండ్ బ్యాటర్లు శతకాలు బాదడం ఇదే తొలిసారి.
1
కివీ్‌సపై ఎక్కువ సెంచరీలు (7) చేసిన బ్యాటర్‌గా విరాట్. అలాగే ఈ ఫార్మాట్‌లో
వన్‌డౌన్‌లో బరిలోకి దిగి అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా విరాట్ (12,672).
పాంటింగ్ (12,655)ను అధిగమించాడు.
ఇవి కూడా చదవండి..
మిచెల్‌ను మైదానం నుంచి బయటకు నెట్టిన కోహ్లీ.. ఫన్నీ వీడియో వైరల్
అథర్వ తైడే సెంచరీ.. సౌరాష్ట్ర లక్ష్యం 318