Share News

Vijay Hazare Trophy Final: అథర్వ తైడే సెంచరీ.. సౌరాష్ట్ర లక్ష్యం 318

ABN , Publish Date - Jan 18 , 2026 | 06:04 PM

విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్‌లో విదర్భ, సౌరాష్ట్ర తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విదర్భ.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది. సౌరాష్ట్రకు 318 పరుగులు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

Vijay Hazare Trophy Final: అథర్వ తైడే సెంచరీ.. సౌరాష్ట్ర లక్ష్యం 318
Vijay Hazare Trophy Final

ఇంటర్నెట్ డెస్క్: ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్‌లో విదర్భ, సౌరాష్ట్ర తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విదర్భ.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది. సౌరాష్ట్రకు 318 పరుగులు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ అథర్వ తైడే((128; 118 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగాడు. వన్‌డౌన్ బ్యాటర్ యశ్‌ రాథోడ్ (54; 61 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకంతో రాణించాడు.


విదర్భ బ్యాటర్లలో అమన్ మొఖడే (33), రవికుమార్ (25), ఫైజ్ మహ్మద్ షేక్ (19), హర్ష్‌ దూబె (17) పరుగులు చేశారు. ఓపెనర్లు అథర్వ, అమన్ కలిసి తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించారు. కాగా యశ్ రాథోడ్‌, అథర్వ రెండో వికెట్‌కు ఏకంగా133 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సౌరాష్ట్ర బౌలర్లలో అంకుర్ పన్వార్ 4, చిరాగ్ జైన్ 2, చేతన్ సకారియా 2 వికెట్లు పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

రికార్డు సృష్టించిన స్మృతి మంధాన

వైభవ్ సూర్యవంశీ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్

Updated Date - Jan 18 , 2026 | 06:05 PM