Ind Vs NZ: మిచెల్, ఫిలిప్స్ శతకాలు.. భారత్ టార్గెట్ 338
ABN , Publish Date - Jan 18 , 2026 | 05:49 PM
భారత్-న్యూజిలాండ్ జట్లు ఇండోర్ వేదికగా ఆఖరి వన్డే మ్యాచులో తలపడుతున్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు.. తొలి ఇన్నింగ్స్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఏకంగా 337 పరుగులు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్-న్యూజిలాండ్ జట్లు ఇండోర్ వేదికగా ఆఖరి వన్డే మ్యాచులో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ జట్టు అసాధారణ ప్రదర్శన కనబర్చింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఏకంగా 337 పరుగులు చేసింది. టీమిండియాకు 338 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఆదిలోనే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయిన కివీస్ జట్టును.. డారిల్ మిచెల్(137) తన దూకుడుతో భారీ సెంచరీ చేసి గాడిలో పెట్టాడు. ఓపెనర్లు కాన్వే(5), హెన్రీ నికోల్స్(0) స్వల్ప పరుగులకే పెవిలియన్ చేరగా.. డారిల్ మిచెల్(137), విల్ యంగ్(30) ఆదుకున్నారు. యంగ్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన గ్లె్న్ ఫిలిప్స్(106) చెలరేగాడు. మిచెల్, ఫిలిప్స్ ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు ఏకంగా 219 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత బౌలర్లు ఎలాంటి ప్రణాళికలు వేసినా ఫలించలేదు. మిచెల్ ఔటయ్యాక.. బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. మిచెల్ హే(2), ఫోక్స్(10), క్లార్కే(11) విఫలమయ్యారు. కెప్టెన్ బ్రేస్‌వేల్(28*), జెమీసన్(0*) నాటౌట్‌గా నిలిచారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా తలో మూడు, సిరాజ్, కుల్దీప్ యాదవ్ చెరొక వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
రికార్డు సృష్టించిన స్మృతి మంధాన
వైభవ్ సూర్యవంశీ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్