Smriti Mandhana: రికార్డు సృష్టించిన స్మృతి మంధాన
ABN , Publish Date - Jan 18 , 2026 | 03:29 PM
మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఇందులో ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన ఓ అరుదైన ఘనత సాధించింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్‌గా రికార్డులోకెక్కింది.
ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్మృతి మంధాన(96) కెప్టెన్ నాక్ ఆడింది. 61 బంతులు ఎదుర్కొని 96 పరుగులు చేసిన స్మృతి.. తృటిలో సెంచరీ మిస్ చేసుకుంది. అయినప్పటికీ మంధాన(Smriti Mandhana) ఓ అరుదైన ఘనత సాధించింది. అద్భుత ఇన్నింగ్స్ ఆడి ఎలైట్ జాబితాలో చోటు దక్కించుకుంది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 166 పరుగులకు ఆలౌటైంది. 167 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ నేపథ్యంలో స్మృతి తన నాక్‌తో డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన బ్యాటర్ల జాబితాలో చేరింది. అయితే డబ్ల్యూపీఎల్‌లో ఓ భారత బ్యాటర్ అత్యధిక వ్యక్తిగత స్కోరు కూడా ఇదే కావడం విశేషం. ఈ టోర్నీలో ఆర్సీబీ జట్టు అద్భుత ప్రదర్శనలు చేస్తూ తిరుగులేని జట్టుగా నిలిచింది. ఆడిన నాలుగింట్లో అన్నీ మ్యాచులు గెలిచి స్కోరు బోర్డులో అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీపై చేసిన ప్రదర్శనకు ఆమెకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
డబ్ల్యూపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు ఇవే..
99* - జార్జియా వాల్ (ఆర్సీబీ) - 2025
99 - సోఫీ డివైన్ (ఆర్సీబీ) - 2023
96*- అలిస్సా హీలీ (యూపీ వారియర్స్) - 2023
96*- బెత్ మూనీ (గుజరాత్) - 2025
96 - స్మృతి మంధాన (ఆర్సీబీ)-2026
ఇవి కూడా చదవండి:
7 పరుగులకే 5 వికెట్లు.. మ్యాచ్ చివర్లో అదిరే ట్విస్ట్.!