Share News

WPL 2026: యూపీ వారియర్స్ ఘన విజయం..

ABN , Publish Date - Jan 17 , 2026 | 06:54 PM

డబ్ల్యూపీఎల్ 2026 లో భాగంగా శనివారం నవీ ముంబై వేదికగా యూపీ వారియర్స్-ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. ఈ పోరులో యూపీ వారియర్స్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుసగా ముంబైని రెండో సారి ఓడించింది.

WPL 2026: యూపీ వారియర్స్ ఘన విజయం..
WPL 2026

ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్‌లో (WPL 2026) భాగంగా శనివారం నవీ ముంబై వేదికగా యూపీ వారియర్స్-ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. ఈ పోరులో యూపీ వారియర్స్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన యూపీ.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. 188 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. 165/6కే పరిమితమైంది. ఆరు, ఏడు స్థానాల్లో వచ్చిన అమేలియా కెర్ (49*; 28 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌), అమన్‌జ్యోత్‌ కౌర్ (41; 24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మాత్రమే రాణించారు. వారి వల్లే జట్టుకు ఆమాత్రం స్కోరు అయినా దక్కింది. టాపార్డర్ బ్యాటర్లు హేలి మాథ్యూస్ (13), సజీవన్ సజన (10), నాట్ సీవర్ బ్రంట్ (15), హర్మన్‌ప్రీత్ కౌర్ (18)స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. యూపీ బౌలర్లలో శిఖా పాండే 2, క్రాంతి గౌడ్, సోఫీ ఎకిల్‌స్టోన్, దీప్తి శర్మ, క్లో ట్రయాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ సీజన్‌లో గత మ్యాచ్‌లోనూ ముంబైపై గెలిచిన యూపీ గెలుపు ఖాతా తెరిచింది.


యూపీ బ్యాటర్లలో కెప్టెన్‌ మెగ్ లానింగ్ (70), వన్‌డౌన్ బ్యాటర్ ఫోబ్ లీచ్‌ఫీల్డ్ (61) ధనాధన్ ఆటతో అలరించారు. హర్లీన్ డియోల్ (25), క్లో ట్రయాన్ (21) రాణించారు. లానింగ్, లీచ్‌ఫీల్డ్ రెండో వికెట్‌కు 74 బంతుల్లో 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. లానింగ్ 34 బంతుల్లో అర్ధ శతకం చేయగా.. అమన్‌జ్యోత్‌ వేసిన 13 ఓవర్లలో లీచ్‌ఫీల్డ్ రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లు బాది హాఫ్‌ సెంచరీ (33 బంతుల్లో) పూర్తి చేసుకుంది. అదే ఓవర్‌లో చివరి బంతికి ఔటైంది. యూపీ చివరి రెండు ఓవర్లలో 10 పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. ముంబై బౌలర్లలో అమేలియా కెర్ 3, నాట్‌సీవర్ 2, నికోలి కేరీ, అమన్‌జ్యోత్, హేలీ మాథ్యూస్ ఒక్కో వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

ముదిరిన భారత్-బంగ్లా వివాదం.. ఆటగాళ్ల నో హ్యాండ్ షేక్

ఐసీసీ అధికారికి వీసా నిరాకరించిన బంగ్లాదేశ్.!

Updated Date - Jan 17 , 2026 | 07:39 PM