WPL 2026: చెలరేగిన యూపీ బ్యాటర్లు.. ముంబై టార్గెట్ 188
ABN , Publish Date - Jan 17 , 2026 | 05:00 PM
డబ్ల్యూపీఎల్ 2026లో భాగంగా నేడు యూపీ వారియర్స్-ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఆది నుంచే చెలరేగుతూ ఆడిన యూపీ బ్యాటర్లు భారీ స్కోరు సాధించారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 187 పరుగులు సాధించారు. ముంబైకి 188 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు.
ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా శనివారం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా యూపీ వారియర్స్-ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబై జట్టు ఫీల్డింగ్ ఎంచుకుని తొలుత యూపీని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆది నుంచే చెలరేగుతూ ఆడిన యూపీ బ్యాటర్లు భారీ స్కోరు సాధించారు. నిర్ణీత 20 ఓవర్ల(WPL 2026)లో 8 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేశారు. ముంబైకి 188 పరుగులు భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. కెప్టెన్ మెగ్ లానింగ్(70; 45 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సులు), ఫోబ్ లిచ్‌ఫీల్డ్(61; 37 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగి ఆడారు.
హర్లీన్ డియోల్(25), క్లో ట్రయాన్(21) కూడా రాణించారు. లానింగ్, లిచ్‌ఫీల్డ్ రెండో వికెట్‌కు 74 బంతుల్లో ఏకంగా 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. లానింగ్ 34 బంతుల్లో అర్ధ శతకం చేయగా.. అమన్‌జ్యోత్ వేసిన 13 ఓవర్‌లో లిచ్‌ఫీల్డ్ రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లు బాది 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. అదే ఓవర్‌లో చివరికి బంతికి ఔటైంది. యూపీ చివరి రెండు ఓవర్లలో 10 పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. ముంబై బౌలర్లలో అమేలియా కెర్ 3, నాట్‌సీవర్ 2, నికోలి కేరీ, అమన్‌జ్యోత్, హేలీ మాథ్యూస్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
ముదిరిన భారత్-బంగ్లా వివాదం.. ఆటగాళ్ల నో హ్యాండ్ షేక్
ఐసీసీ అధికారికి వీసా నిరాకరించిన బంగ్లాదేశ్.!