Shubman Gill: ఇండోర్‌లో కలుషిత నీరు.. గిల్ చేసిన పనికి షాక్ అవ్వాల్సిందే..
ABN , Publish Date - Jan 17 , 2026 | 04:16 PM
భారత్-న్యూజిలాండ్ జట్లు ఇండోర్ వేదికగా ఆదివారం మూడో వన్డే మ్యాచ్ ఆడనున్నాయి. అయితే.. ఇటీవల ఇండోర్‌లో కలుషిత నీరు తాగడం వల్ల పలువురు మృత్యువాతపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ గిల్ చేసిన ఓ పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్-న్యూజిలాండ్ జట్లు మూడు వన్డేల సిరీస్ ఆడతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు మ్యాచులు జరగ్గా.. ఇరుజట్లు 1-1తేడాతో సమంగా కొనసాగుతున్నాయి. సిరీస్ విజేతను నిర్ణయించే కీలకమైన మూడో వన్డే ఆదివారం ఇండోర్ వేదికగా జరగనుంది. బలమైన కివీస్ జట్టును టీమిండియా ఎదుర్కొని సిరీస్ పడుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
అయితే.. ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఇండోర్‌లో ఇటీవల కలుషిత తాగునీటి వల్ల పలువురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత టీమ్ మేనేజ్‌మెంట్ ఆటగాళ్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఆటగాళ్లున్న ఫైవ్ స్టార్ హోటల్, మైదానంలో పరిశుభ్రమైన నీరందించే ఏర్పాట్లు చేస్తున్నారు. అయినప్పటికీ టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) మరింత ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాడు. తాను బస చేస్తున్న హోటల్‌లోని తన గదిలో రూ.3లక్షలు ఖరీదు చేసే వాటర్ ప్యూరిఫయర్‌ను బిగించుకున్నట్లు సమాచారం. ఈ పరికరానికి ఆర్వో వాటర్, ప్యాకేజ్డ్ వాటర్‌ను కూడా మళ్లీ ప్యూరిఫై చేసే సామర్థ్యం ఉన్నట్టు తెలుస్తోంది.
విరాట్ ఎప్పటి నుంచో..
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎప్పటి నుంచో తాను తాగే నీటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. అతడు ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్స్ పర్వతాల నుంచి సేకరించే ప్రత్యేక వాటర్‌ను మాత్రమే వినియోగిస్తాడన్న విషయం అందరికీ తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
ముదిరిన భారత్-బంగ్లా వివాదం.. ఆటగాళ్ల నో హ్యాండ్ షేక్
ఐసీసీ అధికారికి వీసా నిరాకరించిన బంగ్లాదేశ్.!