U19 WC 2026: ముదిరిన భారత్-బంగ్లా వివాదం.. ఆటగాళ్ల నో హ్యాండ్ షేక్!
ABN , Publish Date - Jan 17 , 2026 | 03:21 PM
అండర్ 19 ప్రపంచ కప్ 2026లో చోటు చేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల కుర్రాళ్లు కీలక పోరులో తలపడుతున్నారు. అయితే.. టాస్ సమయంలో భారత కెప్టెన్ ఆయుశ్ మాత్రే, బంగ్లా వైస్ కెప్టెన్ జవాద్ అబ్రార్ పరస్పరం షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్-బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్ తరహాలోనే బంగ్లాదేశ్ కూడా భారత్ పట్ల మొండి వైఖరిని ప్రదర్శిస్తోంది. తాజాగా.. అండర్ 19 ప్రపంచ కప్ 2026లో చోటు చేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ కుర్రాళ్లు కీలక పోరులో తలపడుతున్నారు. అయితే.. టాస్ సమయంలో భారత కెప్టెన్ ఆయుశ్ మాత్రే, బంగ్లా వైస్ కెప్టెన్ జవాద్ అబ్రార్ పరస్పరం షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే.. వర్షం కారణంగా టాస్(U19 World Cup 2026) కాస్త ఆలస్యమైంది. బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ అజిజుల్ హకీం తుది జట్టులో ఉన్నప్పటికీ టాస్‌కు హాజరు కాలేదు. కెప్టెన్ టాస్‌కు రాకపోవడంపై కారణాలు తెలియ రాలేదు. అతడికి బదులుగా వైస్ కెప్టెన్ జవాద్ అబ్రార్ టాస్ వేశాడు. ఇందులో టాస్ గెలిచిన అబ్రార్.. ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పరిస్థితులు, జట్టు మార్పులపై ఇరువురు ప్రొఫెషనల్‌గా మాట్లాడినప్పటికీ.. షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంపై అభిమానుల దృష్టి మళ్లింది. గతంలో 2025 ఆసియా కప్, మహిళల వన్డే ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ జట్లతో టీమిండియా షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ధోరణి బంగ్లాదేశ్‌పైనా కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది.
మ్యాచ్ విషయానికొస్తే..
టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. కెప్టెన్ ఆయుశ్ మాత్రే(6), వేదాంత్ త్రివేది(0), విహాన్ మల్హోత్రా(7) స్వల్ప పరుగులకే పెవిలియన్ చేరారు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ(72*) సెంచరీ దిశగా సాగుతున్నాడు. మరో ఎండ్‌లో అభిజ్ఞాన్ కుందు(22*) పర్వాలేదనిపిస్తున్నాడు. 26 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా.. 3 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో అల్ ఫహద్ 2, అజిజుల్ హకీం 1 వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
రిటైర్డ్ ఔట్, రిటైర్డ్ హర్ట్ తేడా ఏంటంటే?
బుమ్రా కుమారుడి సూపర్ బౌలింగ్.. వీడియో వైరల్