Women Premier League 2026: బెంగళూరు హ్యాట్రిక్
ABN , Publish Date - Jan 17 , 2026 | 05:09 AM
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జోరు కొనసాగిస్తోంది. ఆల్‌రౌండ్ షోతో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ విజయంతో...
డబ్ల్యూపీఎల్‌లో నేడు
ముంబై X యూపీ (మ. 3.00)
ఢిల్లీ X బెంగళూరు (రా. 7.30)
వరుసగా మూడో విజయం, రాధ అర్ధశతకం
శ్రేయాంక పాంచ్ పటాక. గుజరాత్ ఓటమి
నవీ ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జోరు కొనసాగిస్తోంది. ఆల్‌రౌండ్ షోతో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్ర స్థానాన్ని పటిష్టం చేసుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 32 పరుగులతో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది. తొలుత బెంగళూరు 20 ఓవర్లలో 182/7 స్కోరు చేసింది. రాధా యాదవ్ (47 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66) లీగ్‌లో తొలి హాఫ్ సెంచరీ చేసింది. రిచా ఘోష్ (28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44) కొద్దిలో అర్ధ శతకం మిస్సయింది. రాధ, రిచా ఐదో వికెట్‌కు 105 పరుగులతో ఆదుకున్నారు. చివర్లో డి క్లెర్క్ (12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 26) ధనాధన్ బ్యాటింగ్‌తో అలరించింది. యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ (5/23) ఐదు వికెట్లతో తిప్పేయడంతో.. ఛేదనలో గుజరాత్ 18.5 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌటైంది. భారతీ ఫుల్‌మాలీ (20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39), బేత్ మూనీ (14 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 27), తనూజా కన్వర్ (13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 21) మాత్రమే రాణించారు. లారెన్ బెల్ 3 వికెట్లు తీసింది. రాధా యాదవ్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచింది.
సంక్షిప్తస్కోర్లు
బెంగళూరు: 20 ఓవర్లలో 182/7 (రాధా యాదవ్ 66, రిచా ఘోష్ 44, డి క్లెర్క్ 26, సోఫీ డివైన్ 3/31, కష్వీ గౌతమ్ 2/42).
గుజరాత్: 18.5 ఓవర్లలో 150 ఆలౌట్ (భారతీ ఫుల్‌మాలీ 39, బేత్‌మూనీ 27, తనుజా కన్వర్ 21, శ్రేయాంక పాటిల్ 5/23, లారెన్ బెల్ 3/29).
యూపీ గెలిచింది..
డబ్ల్యూపీఎల్‌లో యూపీ వారియర్స్ ఎట్టకేలకు బోణీ చేసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఏడు వికెట్లతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌కు షాకిచ్చింది. తొలుత ముంబై 20 ఓవర్లలో 161/5 స్కోరు చేసింది. నాట్ షివర్ బ్రంట్ (65), అమన్‌జోత్ (38), నికోలా కేరీ (32 నాటౌట్) రాణించారు. శిఖ, ఎకిల్‌స్టోన్, దీప్తీశర్మ, ఆశా శోభన తలా ఒక్కో వికెట్ పడగొట్టారు. ఛేదనలో యూపీ 18.1 ఓవర్లలో 162/3 స్కోరు చేసి నెగ్గింది. హర్లీన్ డియోల్ (64 నాటౌట్), ట్రయన్ (27 నాటౌట్), మెగ్ లానింగ్ (25), లిచ్‌ఫీల్డ్ (25) సత్తా చాటారు. బ్రంట్ 2 వికెట్లు దక్కించుకుంది.
ఇవి కూడా చదవండి:
రిటైర్డ్ ఔట్, రిటైర్డ్ హర్ట్ తేడా ఏంటంటే?
బుమ్రా కుమారుడి సూపర్ బౌలింగ్.. వీడియో వైరల్