Bumrah son Angad: బుమ్రా కుమారుడి సూపర్ బౌలింగ్.. వీడియో వైరల్
ABN , Publish Date - Jan 15 , 2026 | 05:04 PM
ప్రాక్టీస్ సెషన్లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన కొడుకు కలిసి సరదాగా గడిపాడు. బుమ్రా కుమారుడు అంగద్ బౌలింగ్ చేసిన క్యూట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను బుమ్రా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఎంత పవర్‌ఫుల్ బౌలరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన యార్కర్ బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను హడలెత్తించే వాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్ కోసం జస్ప్రీత్ బుమ్రా సిద్ధమవుతున్నాడు. నెట్ ప్రాక్టీస్ చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇంత బిజీ టైమ్ లో కూడా ఫ్యామిలీ కోసం సమయాన్ని కేటాయిస్తున్నాడు. ఈక్రమంలోనే ప్రాక్టీస్ సెషన్లో బుమ్రా తన కొడుకు అంగద్‌తో(Bumrah son Angad) కలిసి సరదాగా గడిపాడు. బుమ్రా కుమారుడు బౌలింగ్ చేసిన క్యూట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను బుమ్రా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. బుమ్రా అభిమానులు ఆ వీడియోను చూసి తెగ మురిసిపోతున్నారు. అంతేకాక 'క్యూటెస్ట్ వీడియో ఆఫ్ ది ఇంటర్నెట్' అని కొనియాడుతున్నారు.
వైరల్ అవుతోన్న వీడియోలో బుమ్రా వార్మప్ రన్ చేస్తున్నాడు. ఇదే సమయంలో చిన్నారి అంగద్ కూడా తన తండ్రి వెంటే పరిగెత్తుతూ కనిపించాడు. ఆ తర్వాత బుమ్రా తన కొడుకుకు బౌలింగ్ ఎలా చేయాలో నేర్పించాడు. అంగద్ కూడా బుమ్రా స్టైల్‌ను అనుకరిస్తూ తన చిట్టి చేతులతో బంతిని పట్టుకుని వికెట్ల వైపు విసరాడు. అంగద్ క్యూట్ బౌలింగ్(Bumrah practice session) అందరినీ తెగ ఆకట్టుకుంది. అలానే ఈ వీడియోకు బుమ్రా 'నా కొత్త ట్రైనింగ్ పార్ట్నర్ నన్ను ఎప్పుడూ మోటివేటెడ్‌గా ఉంచుతాడు' అని క్యాప్షన్ ఇచ్చాడు. ఇక బుమ్రా క్రికెట్ విషయానికి వస్తే.. న్యూజిలాండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్ నుంచి జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చారు. వర్క్‌లోడ్ కారణంగా మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. 2026 జనవరి 21నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్(India vs New Zealand T20 series) ద్వారా బుమ్రా మళ్లీ యాక్షన్‌లోకి రానున్నాడు. ఈ సిరీస్‌లో భారత్ కివీస్‌తో 5 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.
ఇవి కూడా చదవండి:
11 ఏళ్ల రికార్డు.. చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్!
Indian origin cricketers: కెనడా జట్టు కెప్టెన్‌గా భారత సంతతి వ్యక్తి