Home » Jasprit Bumrah
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ నుంచి వర్క్‌లోడ్ కారణంగా బుమ్రా దూరమయ్యాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అతడికి కీలక సూచనలు చేశాడు. వైట్ బాల్ క్రికెట్‌కే ప్రాధాన్యం ఇవ్వాలని, అత్యవసరమైతేనే టెస్టులు ఆడాలని అశ్విన్ పేర్కొన్నాడు.
టీమిండియా ఆటగాళ్లను గాయాల బెడద వేధిస్తోంది. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లు మరీ సున్నితంగా తయారయ్యారనే వాదనలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 30 నుంచి సౌతాఫ్రికాతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సిరీస్‌కు బుమ్రా, హార్దిక్ పాండ్యలకు రెస్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం.
సాతాఫ్రికా కెప్టెన్ బావుమాను బుమ్రా మరుగుజ్జు అంటూ సంబోధించిన విషయం తెలిసిందే. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు బుమ్రాపై ఫైరయ్యారు. ఈ నేపథ్యంలో తొలి టెస్ట్ ముగిసిన తర్వాత బావుమాకు బుమ్రా సారీ చెప్పాడు.
టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరో వికెట్ తీస్తే టీ20ల్లో 100 వికెట్లు పూర్తి చేసుకోనున్నాడు. తిలక్ వర్మ, అభిషేక్ శర్మ కూడా కీలక మైలురాళ్లకు చేరువలో ఉన్నారు. ఆస్ట్రేలియాతో జరుగనున్న ఐదో టీ20లో ఈ రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది.
శుక్రవారం వెస్టిండీస్‌తో ఢిల్లీ వేదికగా ప్రారంభమైన రెండో టెస్ట్‌తో బుమ్రా ఓ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు సృష్టించాడు. అంతేకాక 93 ఏళ్లలో ఒక్కే ఒక్కడి బుమ్రా నిలిచాడు.
అనుకున్నట్టుగానే టీమిండియా ఆసియా కప్‌లో తన ప్రతాపం చూపించింది. అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ ఆధిపత్యం ప్రదర్శించి సత్తా చాటింది. యూఏఈ నిర్దేశించిన లక్ష్యాన్ని ఐదు ఓవర్ల లోపే ఛేదించింది.
ఇటీవలి ఇంగ్లండ్ సిరీస్‌లో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ అద్భుతమైన ఆటతీరు కనబరిచాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో అత్యధిక ఓవర్లు వేయడమే కాకుండా, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా నిలిచాడు. ఐదు టెస్ట్ మ్యాచ్‌ల్లో ఏకంగా 23 వికెట్లు పడగొట్టాడు.
భారత యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా ఈసారి తన ఆటతోనే కాదు, ఫుడ్ గేమ్‌తో కూడా వార్తల్లో నిలిచాడు. ఓ యూట్యూబ్ ఛానెల్లో Snack Wars అనే ఆసక్తికర సెగ్మెంట్లో పాల్గొన్న బుమ్రా, ఇండియా వర్సెస్ యూకే స్నాక్స్ గురించి కీలక విషయాలను ప్రస్తావించారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
స్టార్ పేసర్ బుమ్రా లేని పరిస్థితుల్లోనూ టీమిండియా టెస్టుల్లో మరోసారి తన బలాన్ని నిరూపించుకుంది. ఈ సందర్భంగా ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ బుమ్రా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.