టీ20 ప్రపంచ కప్ 2026: యూఎస్ఏతో తొలి మ్యాచ్.. బుమ్రా దూరం!
ABN , Publish Date - Feb 07 , 2026 | 03:07 PM
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా శనివారం రాత్రి భారత్-యూఎస్ఏ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తొలి మ్యాచుకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. అతడు వైరల్ ఫీవర్‌తో బాధ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 సమరం శనివారం ప్రారంభమైంది. ఇప్పటికే గ్రూప్ ఏ మ్యాచులో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన తొలి టీ20లో పాకిస్థాన్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా టీమిండియా-యూఎస్ఏ జట్లు వాంఖడే వేదికగా మరికొద్ది గంటల్లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) తొలి మ్యాచ్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. అతడు వైరల్ ఫీవర్‌తో బాధ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. శుక్రవారం వాంఖడే స్టేడియంలో టీమిండియా ట్రైనింగ్ సెషన్‌కు కూడా అతడు హాజరుకాలేదని సమాచారం. దీంతో ఈ మెగా టోర్నీ(T20 World Cup 2026)లో భారత జట్టు ప్రస్తుతం ఫిట్‌గా ఉన్న 13 మంది ఆటగాళ్లతోనే బరిలోకి దిగనుంది.
ఇప్పటికే వాషింగ్టన్ సుందర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఫిట్‌నెస్ క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. మరోవైపు గాయంతో బాధపడుతున్న హర్షిత్ రాణా మెగా టోర్నీ నుంచి తప్పుకున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. సౌతాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచులో హర్షిత్ మోకాలి గాయానికి గురైన విషయం తెలిసిందే. స్కానింగ్ రిపోర్టులు, వైద్యుల నివేదిక ప్రకారం ఈ టోర్నీలో పాల్గొనేందుకు అతడికి ఫిట్‌నెస్ లేదని బీసీసీఐ మెడికల్ టీమ్ తేల్చింది. కాగా హర్షిత్ రాణా స్థానంలో స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. బుమ్రా గైర్హాజరీలో సిరాజ్(Mohammed Siraj) తుది జట్టులోకి వచ్చే అవకాశముంది.
ఇవి కూడా చదవండి:
అండర్-19 ప్రపంచ కప్ విజేత భారత్
టీ20 ప్రపంచకప్ వేళ గూగుల్ ప్రత్యేక డూడుల్..