Share News

టీ20 ప్రపంచకప్‌ వేళ గూగుల్ ప్రత్యేక డూడుల్‌..

ABN , Publish Date - Feb 07 , 2026 | 12:03 PM

టీ20 ప్రపంచకప్-2026 వేళ ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్.. ప్రత్యేక డూడుల్‌ను రూపొందించింది. ఈ మెగా టోర్నీ ప్రారంభానికి గుర్తుగా వివిధ రంగులతో క్రికెట్‌ను సూచిస్తూ డూడుల్‌ను క్రియేట్ చేసింది..

టీ20  ప్రపంచకప్‌ వేళ గూగుల్ ప్రత్యేక డూడుల్‌..
Google doodle today

స్పోర్ట్స్ డెస్క్: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న టీ20 ప్రపంచకప్ (World Cup-2026) ఇవాళ(శనివారం) ప్రారంభమైంది. కొలంబో వేదికగా పాకిస్థాన్, నెదర్లాండ్స్ మధ్య మొదటి మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ ఐసీసీ టోర్నీని పురస్కరించుకుని గూగుల్ ప్రత్యేక డూడుల్‌ను సృష్టించింది. ప్రపంచకప్ వేడుకలను గుర్తు చేసుకునేందుకు ఈ డూడుల్‌ను రూపొందించినట్లు గూగుల్ తెలుపగా.. బాల్, బ్యాట్, వికెట్లతో పాటు వివిధ రంగులను జత చేసింది.


గూగుల్ యానిమేటెడ్ డూడుల్ (Googl Doodle) కాంతివంతమైన గులాబీ రంగు డిజైన్‌తో ప్రపంచ కప్‌‌ను పరిచయం చేసింది. ఈ డూడుల్‌లో 'G' మరియు 'E' అనే అక్షరాలు ఉన్నాయి, అయితే ఆకుపచ్చ బ్యాట్ తెలివిగా 'L' అక్షరాన్ని సూచించింది. అలానే క్రికెట్ బంతి 'O' స్థానంలో ఉంది. ఇక చివర ఉన్న 'E' అక్షరం శ్రీలంక క్రికెట్ అభిమానుల సంస్కృతి, స్టేడియంలోని వేడుకలకు ఒక సంకేతంగా డ్రమ్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఈ డూడుల్‌పై క్లిక్ చేస్తే.. పూర్తి టోర్నమెంట్ షెడ్యూల్‌ కనిపిస్తోంది. ఈ ఇంటరాక్టివ్ డిజైన్‌ ద్వారా టోర్నమెంట్‌లో పాల్గొనే జట్లకు గూగుల్ ఒక డిజిటల్ సెల్యూట్‌ చేస్తున్నట్లుగా ఉంది.


గూగుల్ డూడుల్ అంటే ఏమిటి?

గూగుల్ డూడుల్ అనేది ఒక ప్రత్యేకమైన రోజు, పండుగ, సాంస్కృతిక క్షణం, చారిత్రక సంఘటనకు గుర్తుగా జరుపుకోవడానికి సింబల్‌గా క్రియేట్ చేస్తారు. ఒక ప్రత్యేక సందర్భం వచ్చినప్పుడల్లా గూగుల్ తన హోమ్‌పేజీ లోగోను క్రియేటివ్, ఇంటరాక్టివ్ డిజైన్‌గా మారుస్తుంది. దీన్నే మనం డూడుల్ అని పిలుస్తాం. గూగుల్ ఇప్పటికీ 5,000 కంటే ఎక్కువ డూడుల్‌లను సృష్టించింది. నేటి నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్-2026 కోసం గూగుల్ క్రియేట్ చేసిన ఈ డూడుల్ వాటిలో ఒకటిగా నిలిచింది.


ఇవీ కూడా చదవండి:

అండర్-19 ప్రపంచ కప్ విజేత భారత్

అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌లో వైభవ్ అరుదైన రికార్డ్

Updated Date - Feb 07 , 2026 | 12:21 PM