Arshdeep Singh: నా ఇన్‌స్టాలో బుమ్రా కనిపించాలంటే..!.. అర్ష్‌దీప్ సింగ్ వ్యాఖ్యలు వైరల్
ABN , Publish Date - Dec 10 , 2025 | 11:57 AM
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్.. బుమ్రాపై సరదా వ్యాఖ్యలు చేశారు. తనతో రీల్ చేయాలంటే బుమ్రా ఇంకా ఎక్కువ వికెట్లు పడగొట్టాలని తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. ముఖ్యంగా తన సహచరులతో రీల్స్ చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తుంటాడు. సౌతాఫ్రికాతో వైజాగ్ వేదికగా జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీతో చేసిన రీల్ తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. కటక్ వేదికగా జరిగిన తొలి టీ20 విజయం తర్వాత.. బుమ్రాపై అర్ష్‌దీప్(Arshdeep Singh) సరదా వ్యాఖ్యలు చేశాడు.
‘జెస్సీ(Bumrah) భాయ్ ఇంకా మరిన్ని వికెట్లు తీసుకోవాలి. అప్పుడే నా ఇన్‌స్టాలో కనిపిస్తాడు. వికెట్ల తీసుకునే విషయంలో బుమ్రా మరింత కసరత్తు చేయాలి. అది జరిగితేనే నేను అతడితో రీల్ చేస్తా’ అని అర్ష్‌దీప్ సరదాగా అన్నాడు.
అది నాకిష్టం..
బుమ్రాతో అతడికున్న అనుబంధాన్ని అర్ష్‌దీప్ సింగ్ పంచుకున్నాడు. ‘నాకు జెస్సీ భాయ్‌తో మంచి అనుబంధం ఉంది. పైగా మేమిద్దరమూ పంజాబీలమే. అతడు జట్టులో సీనియర్ అయినప్పటికీ యువ క్రికెటర్లతో ఎప్పుడూ కఠినంగా ఉండడు. అందరితోనూ చాలా సౌమ్యంగా మాట్లాడుతాడు. అతడితో కలిసి బౌలింగ్ చేయడం అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే బ్యాటర్లు నా బౌలింగ్‌లో అటాక్ చేయడానికి ప్రయత్నిస్తారు. నేను వికెట్లు తీయడానికే గేమ్‌లో ఉన్నా. కానీ వారు నేను వేసే మంచి బంతుల్లోనూ పరుగులు సాధించాలని చూస్తారు. బుమ్రా విషయంలో మాత్రం అలా కాదు. బ్యాటర్లకు అంత తేలిగ్గా పరుగులు ఇవ్వడు. అతడితో కలిసి బౌలింగ్ చేసేటప్పుడు ఇది కూడా నాకు కలిసి వస్తుంది’ అని అర్ష్‌దీప్ సింగ్ వివరించాడు.
ఇవీ చదవండి:
సచిన్ సెంచరీ కోసం.. విరిగిన చెయ్యితో బ్యాటింగ్! అతడు ఎవరంటే?
ఒకే ఒక్కడు.. బుమ్రా వికెట్ల ‘సెంచరీ’!