U-19 World Cup: హెనిల్ పటేల్ దెబ్బ.. విలవిల్లాడిన యూఎస్ఏ బ్యాటర్లు
ABN , Publish Date - Jan 15 , 2026 | 04:00 PM
భారత యువ బౌలర్ హెనిల్ పటేల్ దెబ్బకు యూఎస్ఏ 107 పరుగులకే ఆలౌటైంది. నేటి నుంచి అండర్-19 ప్రపంచ కప్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. టాస్ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత అమెరికా జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. బ్యాటింగ్ కు దిగిన అమెరికా 35.2 ఓవర్లకు 107 పరుగులు చేసి ఆలౌటైంది. యూఎస్ఏ బ్యాటర్లలో నితీశ్ సుదిని(36) మాత్రమే రాణించాడు.
స్పోర్ట్స్ డెస్క్: అండర్-19 ప్రపంచ కప్‌లో భారత యువ బౌలర్ హెనిల్ పటేల్ దెబ్బకు యూఎస్ఏ 107 పరుగులకే ఆలౌటైంది. జనవరి 15 నుంచి అండర్-19 ప్రపంచ కప్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో భాగంగా టీమిండియా.. యూఎస్ఏ(India U19 vs USA U19) జట్టుతో తలపడుతోంది. భారత్ బౌలర్ హెనిల్ పటేల్ ఐదు వికెట్లు తీయడమే కాకుండా తక్కువ పరుగులు మాత్రమే ఇచ్చాడు. భారత బౌలర్ల దెబ్బకు అమెరికా బ్యాటర్లు పరుగులు రాబట్టేందుకు తీవ్రంగా శ్రమించారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన యువ భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన అమెరికా 35.2 ఓవర్లకు 107 పరుగులకే(USA U19 collapse) ఆలౌటైంది. యూఎస్ఏ బ్యాటర్లలో నితీశ్ సుదిని(36) మాత్రమే రాణించాడు. అద్నిత్ జాంబ్18, సాహిల్ గార్గ్ 16, అర్జున్ మహేష్ 16 పరుగులు చేశారు. 39 పరుగులకే ఐదు వికెట్లు పడిన దశలో నితీశ్ సుదిని ఆదుకున్నాడు.
ఒకవైపు సహచరులు పెవిలియన్ చేరుతున్నా.. నితీశ్ మాత్రం కాసేపు స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. ఇక భారత బౌలర్లలో హెనిల్ పటేల్ ఐదు వికెట్లు తీసి.. కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీపేశ్ దేవేంద్రన్, ఖిలాన్ పటేల్,ఆర్ఎస్ అంబ్రిష్, వైభవ్ సూర్యవంశీ తలో వికెట్ సాధించారు. మొత్తంగా భారత్ ముందు 108 పరుగుల స్వల్ప టార్గెట్ ఉంది. భారత్ బ్యాటర్ల ఫామ్ చూస్తే..ఈ స్కోర్ చాలా చిన్నదేనని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
11 ఏళ్ల రికార్డు.. చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్!
Indian origin cricketers: కెనడా జట్టు కెప్టెన్‌గా భారత సంతతి వ్యక్తి