Share News

Ind vs Nz: 11 ఏళ్ల రికార్డు.. చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్!

ABN , Publish Date - Jan 15 , 2026 | 08:12 AM

టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు. రాజ్‌కోట్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో రాహుల్ సెంచరీతో అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో శతకం బాదిన తొలి భారత వన్డే ప్లేయర్‌గా కేఎల్ రాహుల్ రికార్డులకెక్కాడు.

Ind vs Nz: 11 ఏళ్ల రికార్డు.. చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్!
KL Rahul

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు. రాజ్‌కోట్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో రాహుల్(112*) సెంచరీతో అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో శతకం బాదిన తొలి భారత వన్డే ప్లేయర్‌గా కేఎల్ రాహుల్(KL Rahul) రికార్డులకెక్కాడు. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ స్టేడియంలో శతక్కొట్టి.. అరుదైన ఘనతను సాధించాడు.


టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 284 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్(56), కేఎల్ రాహుల్(112*) అజేయ శతకంతో చెలరేగి ఆడారు. కాగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా నిరాశపర్చారు. 118 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన రాహుల్ ఆఖరి వరకు పోరాడాడు. దీంతో భారత జట్టు ఆ మోస్తరు స్కోరు అయినా చేయగలిగింది.


రికార్డుల రాహుల్..

96 వ్యక్తిగత స్కోర్ వద్ద జెమీసన్ బౌలింగ్‌లో సిక్స్ బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాగా రాహుల్‌కి ఇది వన్డేల్లో 8వ సెంచరీ. ఈ మైదానంలో అత్యధిక వ్యక్తిగత వన్డే స్కోరు కూడా ఇతడిదే. ఈ క్రమంలో అతను 11 ఏళ్ల రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. 2015లో సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ ఈ మైదానంలో 108 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఈ మైదానంలో ఇదే హయ్యెస్ట్ వన్డే వ్యక్తిగత స్కోర్‌గా ఉండగా.. తాజా ఇన్నింగ్స్‌తో రాహుల్ దీన్ని అధిగమించాడు. ఈ మైదానంలో కేఎల్ రాహుల్(112 నాటౌట్), క్వింటన్ డికాక్(108), స్టీవ్ స్మిత్(98), శిఖర్ ధావన్(96), మిచెల్ మార్ష్(96) టాప్-5 స్కోరర్లుగా కొనసాగుతున్నారు.


ఇవి కూడా చదవండి:

బదోని ఎంపికపై తీవ్ర విమర్శలు.. బ్యాటింగ్ కోచ్ ఏమన్నారంటే?

అరుదైన రికార్డుకు అడుగు దూరంలో విరాట్!

Updated Date - Jan 15 , 2026 | 08:12 AM