India New Zealand Series: సమం చేశారు
ABN , Publish Date - Jan 15 , 2026 | 06:08 AM
మూడు వన్డేల సిరీ్‌సలో సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన పోరులో న్యూజిలాండ్ అదరగొట్టింది. బౌలర్ల ప్రతిభకు తోడు, అద్భుత ఫామ్‌లో ఉన్న డారిల్ మిచెల్...
నేటినుంచే ప్రొ రెజ్లింగ్ లీగ్
యూపీ డామినేటర్స్ X పంజాబ్ రాయల్స్
(రాత్రి 8 గంటలకు సోనీ నెట్‌వర్క్‌లో)
రెండో వన్డేలో భారత్‌పై కివీస్ విజయం
డారిల్ మిచెల్ సూపర్ సెంచరీ
రాహుల్ అజేయ శతకం వృధా
రాజ్‌కోట్: మూడు వన్డేల సిరీ్‌సలో సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన పోరులో న్యూజిలాండ్ అదరగొట్టింది. బౌలర్ల ప్రతిభకు తోడు, అద్భుత ఫామ్‌లో ఉన్న డారిల్ మిచెల్ (117 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 131 నాటౌట్) అజేయ శతకంతో వహ్వా.. అనిపించాడు. దీంతో బుధవారం భారత్‌తో జరిగిన రెండో వన్డేలో కివీస్ 7 వికెట్లతో ఘనవిజయం సాధించింది. సిరీ్‌సను 1-1తో సమం చేసింది. నిర్ణాయక ఆఖరి వన్డే ఆదివారం ఇండోర్‌లో జరుగుతుంది. కాగా.. 2017 తర్వాత భారత్‌లో కివీస్ గెలవడం ఇదే తొలిసారి. ముందుగా భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 284 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (92 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌తో 112 నాటౌట్) అజేయ సెంచరీతో సత్తా చాటగా, కెప్టెన్ గిల్ (53 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో 56) అర్ధశతకం చేశాడు. క్రిస్టియన్ క్లార్క్‌కు 3 వికెట్లు దక్కాయి. ఛేదనలో కివీస్ 47.3 ఓవర్లలో 286/3 స్కోరు చేసి నెగ్గింది. విల్ యంగ్ (98 బంతుల్లో 7 ఫోర్లతో 87), గ్లెన్ ఫిలిప్స్ (32 నాటౌట్) సహకరించారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా డారిల్ మిచెల్ నిలిచాడు.
డారిల్-యంగ్ శతక భాగస్వామ్యం: ఓ మాదిరి ఛేదనలో కివీస్ చివరి వరకు నిలకడగా రాణించింది. ఆరంభంలో పేసర్ల జోరుకు ఓపెనర్లు కాన్వే (16), నికోల్స్ (10) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. అటు పవర్‌ప్లేలో జట్టు చేసింది 34 పరుగులే. అయితేనేం.. ఫామ్‌లో ఉన్న డారిల్ మిచెల్ మరోసారి చక్కటి స్వీప్ షాట్లతో ఆకట్టుకున్నాడు. అతడికి యంగ్ తోడవ్వడంతో భారత బౌలర్లు వికెట్ తీసేందుకు చెమటోడ్చారు. 13వ ఓవర్‌లో జత కట్టిన ఈ జోడీ సమన్వయ ఆటతీరుతో పాతిక ఓవర్ల పాటు ఆధిపత్యం చూపారు. కుల్దీప్ ఓవర్లలో మిచెల్ భారీషాట్లకు దిగాడు. మిచెల్ 80 పరుగుల వద్ద ఉన్నప్పుడు సులువైన క్యాచ్‌ను ప్రసిద్ధ్ వదిలేశాడు. శతకం వైపు సాగుతున్న యంగ్‌ను కుల్దీప్ అవుట్ చేయడంతో మూడో వికెట్‌కు 162 పరుగుల భారీ భాగస్వామ్యానికి చెక్ పడింది. తర్వాత మిచెల్ 96 బంతుల్లో శతకం పూర్తి చేసుకోగా.. ఫిలిప్స్ సహకారంతో 15 బంతులుండగానే ఫోర్‌తో మ్యాచ్‌ను ముగించాడు.
ఆదుకున్న రాహుల్: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఇన్నింగ్స్ ఆచితూచి సాగినా.. ఓపెనర్లు రోహిత్ (24), గిల్ శుభారంభం అందించారు. పేసర్ జేమిసన్ తన పదునైన బంతులతో తొలి రెండు ఓవర్లను మెయిడిన్‌గా వేశాడు. కానీ తొలి ఐదు ఓవర్లలో 10 పరుగులే రాగా, ఆ తర్వాత రోహిత్-గిల్ బౌండరీలతో విరుచుకుపడ్డారు. దీంతో పవర్‌ప్లేలో జట్టు 57 రన్స్‌తో నిలిచింది. అనంతరం రోహిత్‌ను క్లార్క్ అవుట్ చేయడంతో తొలి వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కాసేపటికే వరుసగా రెండో ఫిఫ్టీ పూర్తి చేసిన గిల్‌ను జేమిసన్ దెబ్బతీశాడు. ఆ తర్వాత పిచ్ నెమ్మదించడంతో పాటు కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేశారు. ఫలితంగా పది ఓవర్లపాటు కనీసం బౌండరీ కూడా రాలేదు. దీనికి తోడు శ్రేయాస్ (8), విరాట్ కోహ్లీ (23)లను క్లార్క్ పెవిలియన్ చేర్చడంతో జట్టు 99/1 నుంచి ఒక్కసారిగా 118/4 స్కోరుతో కష్టాల్లో పడింది. ఈ దశలో రాహుల్-జడేజా (27) ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. రిస్కీ షాట్లకు వెళ్లకుండా సింగిల్స్‌పై దృష్టి సారించారు. ఆ తర్వాత రాహుల్ అడపాదడపా బౌండరీలతో 41వ ఓవర్‌లో జట్టు స్కోరు 200కి చేరింది. అయితే జడేజాను బ్రేస్‌వెల్ వెనక్కి పంపడంతో ఐదో వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. బంతికో పరుగు చొప్పున సాధించిన నితీశ్ (20), హర్షిత్ (2) వరుస ఓవర్లలో అవుట వగా.. చివరి రెండు ఓవర్లలో రాహుల్ 26 రన్స్ అందించడంతో పాటు 87 బంతుల్లో శతకాన్ని పూర్తి చేశాడు.
స్కోరుబోర్డు
భారత్: రోహిత్ (సి) యంగ్ (బి) క్లార్క్ 24, గిల్ (సి) మిచెల్ (బి) జేమిసన్ 56, కోహ్లీ (బి) క్లార్క్ 23, శ్రేయాస్ (సి) బ్రేస్‌వెల్ (బి) క్లార్క్ 8, రాహుల్ (నాటౌట్) 112, జడేజా (సి అండ్ బి) బ్రేస్‌వెల్ 27, నితీశ్ (సి) ఫిలిప్స్ (బి) ఫౌక్స్ 20, హర్షిత్ (సి) బ్రేస్‌వెల్ (బి) లెనాక్స్ 2, సిరాజ్ (నాటౌట్) 2, ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 50 ఓవర్లలో 284/7; వికెట్ల పతనం: 1-70, 2-99, 3-115, 4-118, 5-191, 6-248, 7-256; బౌలింగ్: జేమిసన్ 10-2-70-1, ఫౌక్స్ 9-0-67-1, క్లార్క్ 8-0-56-3, లెనాక్స్ 10-0-42-1, బ్రేస్‌వెల్ 10-1-34-1, ఫిలిప్స్ 3-0-13-0.
న్యూజిలాండ్: కాన్వే (బి) హర్షిత్ 16, నికోల్స్ (బి) ప్రసిద్ధ్ 10, విల్ యంగ్ (సి) నితీశ్ (బి) కుల్దీప్ 87, డారిల్ మిచెల్ (నాటౌట్) 131, గ్లెన్ ఫిలిప్స్ (నాటౌట్) 32, ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 47.3 ఓవర్లలో 286/3; వికెట్ల పతనం: 1-22, 2-46, 3-208; బౌలింగ్: సిరాజ్ 9-0-41-0, హర్షిత్ రాణా 9.3-1-52-1, ప్రసిద్ధ్ 9-0-49-1, నితీశ్ 2-0-13-0, జడేజా 8-0-44-0, కుల్దీప్ 10-0-82-1.
1
న్యూజిలాండ్‌పై భారత్ తరఫున ఎక్కువ పరుగులు (1773) చేసిన బ్యాటర్‌గా విరాట్. సచిన్ (1750)ను అధిగమించాడు. ఓవరాల్‌గా పాంటింగ్ (1971) ముందున్నాడు.
8
రాహుల్, మిచెల్‌లకు ఇది ఎనిమిదో వన్డే సెంచరీ.
1
మిచెల్ భారత్‌లో ఆడిన చివరి నాలుగు వన్డేల్లో 3 శతకాలు, ఓ హాఫ్ సెంచరీ ఉండడం విశేషం. భారత్‌లో భారత్‌పై అత్యధిక సెంచరీలు (3) చేసిన తొలి కివీస్ బ్యాటర్ మిచెల్.
1
భారత గడ్డపై కివీ్‌సకిదే అత్యధిక ఛేదన (285).
ఇవీ చదవండి
ప్రయత్నం విఫలమైనా ప్రార్థనలు విఫలం కావు.. డీకే ఆసక్తికర పోస్ట్
జనవరి19న మళ్లీ సీబీఐ విచారణకు విజయ్..