Share News

TVK Vijay: 19న మళ్లీ సీబీఐ విచారణకు విజయ్‌..

ABN , Publish Date - Jan 14 , 2026 | 12:55 PM

అగ్రహీరో, టీవీకే పార్టీ చీఫ్ విజయ్.. ఈనెల 19వతేదీన జరిగే సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. కరూర్‏లో తొక్కిసలాట జరిగి మొత్తం 41 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనిపై సీబీఐ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.

TVK Vijay: 19న మళ్లీ సీబీఐ విచారణకు విజయ్‌..

చెన్నై: కరూర్‌ దుర్ఘటనపై ఈ నెల 19న టీవీకే నేత విజయ్‌(Vijay) మళ్ళీ సీబీఐ విచారణకు హాజరు కానున్నారు. సీబీఐ విచారణ కోసం ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన విజయ్‌.. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే వున్న విషయం తెలిసిందే. సెప్టెంబరు 27న జరిగిన కరూర్‌ తొక్కిసలాట గురించి వారు అడిగిన ప్రశ్నలకు విజయ్‌ సమాధానాలిచ్చారు. సోమవారం సాయంత్రం 6.30 గంటలకు విచారణ ముగిసింది. మంగళవారం కూడా సీబీఐ విచారణ జరగాల్సి ఉన్న పరిస్థితులలో విజయ్‌ తరఫు న్యాయవాదులు సంక్రాంతి కారణంగా విచారణను పండుగ తర్వాత విచారణ కొనసాగించాలని కోరారు. అందుకు అంగీకరించిన సీబీఐ అధికారులు.. ఈ నెల 19న రావాలని సమన్లు జారీ చేసినట్లు సమాచారం.


nani2.2.jpg

విజయ్‌ సీఎం కావాలని పాదయాత్ర...

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే గెలిచి ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్‌(Vijay) ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని వేడుకుంటూ తెన్‌కాశి ప్రాంతానికి చెందిన ఆ పార్టీ కార్యకర్తలు, సినీ అభిమానులు తిరుచెందూర్‌కు పాదయాత్ర చేసేందుకు సన్నద్ధమయ్యారు. ప్రతియేటా సంక్రాంతి సందర్భంగా తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్‌కాశి, విరుదునగర్‌ జిల్లాలకు చెందిన మురుగ భక్తులు తిరుచెందూరు సెంథిల్‌ ఆండవర్‌ ఆలయానికి పాదయాత్రగా వెళుతుంటారు.


ఈ నేపథ్యంలో టీవీకే తెన్‌కాశి సెంట్రల్‌ జిల్లా కార్యదర్శి రాజప్రకాష్‌, కార్యకర్తలు, అభిమానులు కొద్ది రోజులకు ముందు పాదయాత్ర కోసం వ్రతాన్ని ప్రారంభించారు. గురువారం ఉదయం వీరందరూ తిరుచెందూరుకు పాదయాత్రగా వెళ్లేందుకు ఏర్పాట్లు చేపడుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

‘10 నిమిషాల’ డెలివరీ..ఇక రద్దు!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 14 , 2026 | 01:34 PM