Home » Hero Vijay
వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి ప్రత్యేక చిహ్నం కేటాయించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) విజ్ఞప్తి చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న తమకు ఓడ, విజిల్, ఆటో, క్రికెట్ బ్యాట్ తదితర 10 గుర్తుల్లో ఒకదాన్ని కేయించాల్సిందిగా మంగళవారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించింది.
కరూర్ రోడ్‌షోలో 41 మంది దుర్మరణం సంఘటన తర్వాత పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్న తమిళగ వెట్రి కళగం నేత విజయ్ మళ్ళీ పార్టీ వ్యవహారాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఇటీవల కరూర్ మృతుల కుటుంబ సభ్యులను మహాబలిపురం రిసార్ట్‌కు రప్పించి వారికి క్షమాపణ చెప్పి, గాయపడిన వారికి తలా రూ.2లక్షలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
కరూర్ రోడ్‌షోలో తొక్కిసలాట జరిగి 41మంది ప్రాణాలు కోల్పోవటానికి, వందమందికిపైగా గాయపడటానికి ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) నేత విజయ్‌నే కారణమని ‘నామ్ తమిళర్ కట్చి’ (ఎన్టీకే) సమన్వయకర్త సీమాన్ ఆరోపించారు.
వర్షాల కారణంగా కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటల్లో కంకులు మొలకెత్తినట్లే, రాష్ట్ర ప్రజల్లో డీఎంకే పాలనపై తీవ్ర వ్యతిరేకత మొలకెత్తి, పెరిగి పెద్దదై పాలకులను ఇంటికి సాగనంపటం ఖాయమైపోయిందని ‘తమిళగ వెట్రి కళగం’ నాయకుడు విజయ్ జోస్యం చెప్పారు.
గత నెలలో కరూర్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటానని ‘తమిళగ వెట్రి కళగం’ అధ్యక్షుడు విజయ్ భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబీకులను వారిళ్లకే వెళ్లి పరామర్శించడానికి రాలేకపోయినందుకు తీవ్ర భావోద్వేగంతో క్షమాపణ అడిగారు. కరూర్‌లో రోడ్‌షో సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో మృతి చెందిన 41 మంది కుటుంబ సభ్యులను, గాయపడినవారిని విజయ్ పరామర్శించారు.
తమ కూటమిలోకి ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత విజయ్ వస్తే ఘనంగా స్వాగతిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే నయినార్ నాగేంద్రన్ పేర్కొన్నారు.
‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధ్యక్షుడు విజయ్ మళ్ళీ రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. వచ్చే వారం పర్యటన ప్రారంభించాలని విజయ్ భావిస్తున్నారు. ఈ విషయంపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్‌తో పాటు పార్టీ సీనియర్ నేతలతో ఆయన సమాలోచన చేస్తున్నట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి.
వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అన్నాడీఎంకే కూటమిలో చేరకపోతే ఆ పార్టీ పత్తాలేకుండా పోతుందని మాజీ మంత్రి, శాసనసభాపక్ష ఉపనాయకుడు ఆర్బీ ఉదయ్‌కుమార్ హెచ్చరించారు.
కరూర్‌లో సెప్టెంబర్ 27రాత్రి నిర్వహించిన రోడ్‌షోలో జరిగిన తొక్కిసలాటలో గాయపడినవారికి కూడా త్వరలోనే తలా రూ.2లక్షల చొప్పున ఆర్థికసాయం అందిస్తామని టీవీకే నేత విజయ్ ప్రకటించారు. తొక్కిసలాటలో మృతి చెందిన 41 మంది కుటుంబాలకు ఆయన తలా రూ.20 లక్షల చొప్పున వారి బ్యాంక్ ఖాతాలలో జమచేసిన విషయం తెలిసిందే.
కరూర్‌లో ‘తమిళగ వెట్టి కళగం’ (టీవీకే) రోడ్‌షోలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందటానికి ఆ పార్టీ నాయకుడు ఏడు గంటలు ఆలస్యంగా రావటమే కారణమని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు.