Chennai News: సీఎం కావాలనుకుంటున్న విజయ్ కల ఫలించదు..
ABN , Publish Date - Dec 11 , 2025 | 01:31 PM
రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి కోవి చెళియన్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కావాలనుకుంటున్న విజయ్ కల ఫలించదు.. అంటూ ఆయన పేర్కొన్నారు. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అది కలగానే మిగిలిపోతుందే తప్ప నిజం కాదంటూ ఆయన అన్నారు.
- మంత్రి కోవిచెళియన్
చెన్నై: రాజకీయ అనుభవంలేని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ సీఎం కావాలనుకుంటున్న కల ఫలించదని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి కోవి చెళియన్(State Higher Education Minister Kovi Chezhiyan) విమర్శించారు. తంజావూరు జిల్లా వరత్తనాడు సమీపంలోని నడువూరులో లక్ష మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ధాన్యం గోదాము నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం రూ.70.22కోట్లు కేటాయించింది. ఆ గోదాము శంకుస్థాపన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేశారు నడువూరు నుంచి మంత్రి కోవీ.చెళియన్, మాజీమంత్రి ఎస్‌ఎ్‌స.పళనిమాణిక్యం, జిల్లా కలెక్టర్ ప్రియాంక పంకజం, వ్యవసాయశాఖ అధికారులు హాజరయ్యారు.

అనంతరం మంత్రి కోవి చెళియన్ మీడియాతో మాట్లాడుతూ, పుదుచ్చేరి రాష్ట్రంలో గత ఏడాది నుంచి రేషన్‌దుకాణాలు పనిచేస్తున్నాయని, అయితే టీవీకే అధ్యక్షుడు విజయ్ ఆ రాష్ట్రంలో రేషన్‌దుకాణాలే లేవని విమర్శించడం హాస్యాస్పదమన్నారు. రాజకీయ అనుభవం లేకుండానే ముఖ్యమంత్రి పీఠమెక్కాలని ఆశపడుతున్న విజయ్ కల నెరవేరదని, రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రుల కృషి, చరిత్రను ఒక్కసారి ఆయన గుర్తుచేసుకోవాల్సి అవసరం ఉందని మంత్రి సూచించారు.

ఈ వార్తలు కూడా చదవండి..
2030 నాటికి అమెజాన్ ఇండియా రూ.3.15 లక్షల కోట్ల పెట్టుబడులు
3 నెలల్లో తుమ్మిడిహెట్టి డీపీఆర్
Read Latest Telangana News and National News